విమానంలో ఒక ప్యాసింజర్ నుంచి 15 మందికి కరోనా : CDC

విదేశీ విమానంలోని ప్రయాణికురాలి ద్వారా 15 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
మార్చి 1న లండన్ నుంచి హానోయ్, వియత్నం మీదుగా వెళ్తున్న విమానంలో ఒక ప్రయాణికురాలికి కరోనా లక్షణాలు ఉన్నాయని సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రెవెన్షన్ (CDC) ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.
పరిశోధకులు 27ఏళ్ల మహిళగా గుర్తించారు. విమానం ప్రయాణ సమయంలో ఆమెకు దగ్గు, గొంతునొప్పి ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.
విమానంలో బిజినెస్ క్లాసులో 12 మంది ప్రయాణికులు ఉండగా ఎకానమీ క్లాసులో మరో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు.
కరోనా ఇన్ఫెక్షన్ సోకిన వారిలో విమాన సిబ్బంది కూడా ఉన్నారని అధ్యయనం వెల్లడించింది.
కరోనా లక్షణాలతో వెళ్లిన ఫ్లయిట్ జెర్నీ చేసిన మహిళకు నాలుగు రోజుల తర్వాత కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
మార్చి 10న వియత్నాం ఎయిర్ లౌన్స్ విమానంలో విదేశాలకు వెళ్లిన 217 మందిని ట్రేస్ చేసి పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొంది.
వియత్నాంలోని 15 ప్రావిన్స్ లకు వీరంతా వెళ్లారు.. వారి నుంచి ఇతరులకు ఎంతమంది కరోనా ఇన్ఫెక్షన్ సోకిందో కచ్చితమైన ఆధారాలు లేవు.
విమానం VN54 ల్యాండ్ అయ్యే ముందు ప్రయాణికులు, విమాన సిబ్బంది ఎవరూ విమానాల్లో లేదా విమాన శ్రయాల్లో ఫేస్ మాస్క్ లు ధరించాల్సిన అవసరం లేదని ఆరోగ్య అధికారులు తెలిపారు.
విమానంలో ప్రయాణించిన వారంతా యూకే సహా కరోనా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినవారే.. వీరందరికి ముందుగానే థర్మల్ స్ర్కీనింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తారు..
కానీ, అప్పటికి ప్రయాణికురాలిలో కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అనేది అధ్యయనంలో వెల్లడించలేదు.