pear emoji : ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ బయోస్‌లో ‘పియర్’ ఎమోజీలు.. ఎందుకు వాడుతున్నారో తెలుసా?

వ్యక్తిగత విషయాలు కూడా తెలిపేందుకు ఇప్పుడు ఇమోజీలు వాడేస్తున్నారు. పియర్ ఇమోజీ ఇప్పుడు ఇన్‌స్టా‌గ్రామ్, ట్విట్టర్‌లలో తెగ కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఎమోజీని ఎందుకు వాడుతున్నారో మీకు తెలుసా?

pear emoji

pear emoji : మీరు సింగిలా? అని ఇకపై ఎవరినీ అడగనక్కర్లేదు. వారి ఇన్‌స్టాగ్రామ్ బయో చూస్తే సరిపోతుంది. ఇంట్రెస్టింగ్.. చదవండి.

Anti-Valentine’s week: యాంటీ-వాలెంటైన్స్ వీక్ జరుపుకుంటున్న సింగిల్స్.. కడుపుబ్బ నవ్విస్తున్న మీమ్స్

ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ బయోస్‌లో ‘పియర్’ ఎమోజీలను పెడుతున్నారు. కొత్తగా ఇదేంటి? అనుకుంటున్నారు కదా.. తాము ఒంటరి అని ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేరని చెప్పడానికి ఇప్పుడు ఈ ఎమోజీని వాడుతున్నారు. చాలామంది తమ లైఫ్ పార్టనర్స్ ఎంచుకునే విషయంలో అవతలి వారి గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఇక వారిని డైరెక్ట్ గా ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టి విసిగించే పనిలో లేకుండా వారిని గుర్తించడం ఈ ఎమోజీ సులభతరం చేసింది. కొంతమంది పియర్ రింగ్ లు ధరించడం ద్వారా.. కొందరు బయోస్ లో పియర్ ఎమోజీని ఉంచడం ద్వారా తాము సింగిల్ అని షేర్ చేసుకుంటున్నారు.

‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ విషెస్ ‘హ్యాపీ సింగిల్స్ డే’

ఇక సోషల్ మీడియాలో వచ్చిన ఈ కొత్త ప్రయోగం డేటింగ్ వరల్డ్ లో తుఫానుగా మారబోతోంది అని చెప్పాలి. ఒంటరిగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో బయోస్ లో పియర్ ఎమోజీని ఉంచమని అడుగుతున్నారు. ఇక కొంతమంది రియల్ పియర్ గ్రీన్ రింగ్ ని కూడా ధరిస్తున్నారు. ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చూస్తుంటే భవిష్యత్ లో మ్యారేజ్ బ్యూరోలు, పెళ్లిళ్ల పేరయ్యలకు బాగా పని తగ్గేలా అనిపిస్తోంది. ఎవరికి వారే తమ లైఫ్ పార్టనర్ ని సోషల్ మీడియా మాధ్యమంగా ఎంచుకునేందుకు పూర్తి స్ధాయిలో సన్నద్ధమవుతున్నారని అర్ధం అవుతోంది.