Anti-Valentine’s week: యాంటీ-వాలెంటైన్స్ వీక్ జరుపుకుంటున్న సింగిల్స్.. కడుపుబ్బ నవ్విస్తున్న మీమ్స్

వాలెంటైన్స్ వీక్ లో ప్రియుడితో ప్రియురాలు... ప్రియురాలితో ప్రియుడు ఎంతగానో ఎంజాయ్ చేశారు. మరి ప్రియుడు లేని అమ్మాయి, ప్రియురాలు లేని అబ్బాయి వాలెంటైన్స్ డేను జరుపుకోలేరు కదా? వారు నేటి నుంచి యాంటీ-వాలెంటైన్స్ వీక్ ప్రారంభించారు. ఫిబ్రవరి 21తో ఈ వీక్ ముగుస్తుంది.

Anti-Valentine’s week: యాంటీ-వాలెంటైన్స్ వీక్ జరుపుకుంటున్న సింగిల్స్.. కడుపుబ్బ నవ్విస్తున్న మీమ్స్

Anti-Valentine's week

Updated On : February 15, 2023 / 6:24 PM IST

Anti-Valentine’s week: ప్రపంచంలోని ప్రేమికులంతా వాలెంటైన్స్ వీక్ లో బాగా ఎంజాయ్ చేశారు. రోజ్ డేతో ఫిబ్రవరి 7న ప్రారంభమైన వాలెంటైన్స్ వీక్ నిన్న ముగిసింది. ఈ వారం రోజులు, ముఖ్యంగా నిన్న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమ జంటలు షాపింగ్ కు, రెస్టారెంట్లకు, సినిమాలకు తిరుగుతూ ప్రేమలో మునిగితేలారు. నేటి నుంచి యాంటీ-వాలెంటైన్స్ వీక్ మొదలైంది.

స్లాప్ డేతో మొదలైన యాంటీ-వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 15న ముగుస్తుంది. వాలెంటైన్స్ వీక్ లో ప్రియుడితో ప్రియురాలు… ప్రియురాలితో ప్రియుడు ఎంతగానో ఎంజాయ్ చేశారు. మరి ప్రియుడు లేని అమ్మాయి, ప్రియురాలు లేని అబ్బాయి వాలెంటైన్స్ డేను జరుపుకోలేరు కదా? వారు నేటి నుంచి యాంటీ-వాలెంటైన్స్ వీక్ ప్రారంభించారు. ఫిబ్రవరి 21తో ఈ వీక్ ముగుస్తుంది.

తొలిరోజు స్లాప్ డే సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఎన్నో మీమ్స్ వస్తున్నాయి. కడుపుబ్బా నవ్విస్తోన్న మీమ్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రియురాలి లేని వారందరూ తమ బాధను మీమ్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. చెంపదెబ్బ కొట్టే వీడియోలు, ఫొటోలతో మీమ్స్ క్రియేటర్స్ తమ సృజనకు పని చెబుతున్నారు.

Viral Video: ఈవ్ టీజర్‌కు గుణపాఠం.. యువకుడిని చితక్కొట్టిన అమ్మాయిలు.. వీడియో వైరల్