నడిచే పాములను ఎప్పుడైనా చూశారా!

  • Published By: veegamteam ,Published On : November 22, 2019 / 05:05 AM IST
నడిచే పాములను ఎప్పుడైనా చూశారా!

Updated On : November 22, 2019 / 5:05 AM IST

సాధారణంగా ఇప్పటివరకు మనందరికి పాములు నేలమీది జరజరా పాకుతాయని మాత్రమే తెలుసు. అయితే ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. కొన్ని కోట్ల ఏళ్లక్రితం పాములకు కాళ్లు, దవడ ఎముక ఉండేవని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. సుమారు పది కోట్ల ఏళ్ల క్రితం పాములకు కాళ్లు ఉండేవని పరిశోధకులు చెప్పారు.

అదెలా అంటే.. ఇప్పటి పాములకు దూరపు చుట్టమైన ‘నజష్‌ రియోనెగ్రినా’ అనే పురాతన పాము పుర్రె ఒకటి దొరకడంతో దాన్ని హై రెజల్యూషన్‌ స్కాన్లతో ఈ పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమైంది.అయితే పాము ఒక రకమైన బల్లి జాతి నుంచి పరిణామం చెందిందని కెనడా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల అలెస్సాండ్రో పాల్కీ తెలిపారు. అంతేకాదు అప్పుడు పాములు పెద్దసైజులో ఉండేవట.

అయితే తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. మొదట్లో పాములు కాళ్లతో నడుస్తూ వెళ్లిపోయేవి. అలా నడుస్తూ వేగంగా వెళ్లలేకపోతున్నామని భావించిన పాములు కాళ్లను వాడటం మానేసి పాకుతూ వెళ్లడం మొదలుపెట్టాయి. దీంతో నడుస్తూ.. కంటే పాకుతు వేగంగా వెళ్లగలుగుతున్న ఫీల్ వాటికి కలిగింది. అంతే కాళ్లు వాడటం మానేసి పాకడం స్టార్ట్ చేశాయి, ఇక ఏళ్లు గడుస్తున్న కొద్దీ వాటి కాళ్లు చిన్నగా అయిపోయాయి. కొన్ని కోట్ల సంవత్సరాలు తిరిగేసరికి కాళ్లు పూర్తిగా మాయమైపోయాయి.