Solar Cyclone: దూసుకొస్తున్న సౌర తుపాన్.. కమ్యూనికేషన్ సిస్టంపై ఎఫెక్ట్

వెలుతురుపై ఆధారపడి ఉండే ప్రతి జీవికి ప్రత్యక్షంగానైనా.. పరోక్షంగానైనా సూర్యుడే ఆధారం. సూర్యుడిలో జరిగే ప్రతి మార్పు ప్రాణి మనుగడపై ప్రభావం చూపిస్తుంది.

Solar Cyclone: దూసుకొస్తున్న సౌర తుపాన్.. కమ్యూనికేషన్ సిస్టంపై ఎఫెక్ట్

Solar System Heading Towards Earth

Updated On : July 11, 2021 / 4:18 PM IST

Solar Cyclone: వెలుతురుపై ఆధారపడి ఉండే ప్రతి జీవికి ప్రత్యక్షంగానైనా.. పరోక్షంగానైనా సూర్యుడే ఆధారం. సూర్యుడిలో జరిగే ప్రతి మార్పు ప్రాణి మనుగడపై ప్రభావం చూపిస్తుంది. అలా ప్రమాదం జరిగాక తెలిసే కంటే ముందుగానే అప్రమత్తమైతే జాగ్రత్తగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.

సూర్యుడిపై సర్వ సాధారణంగా సంభవించే సౌర తుపానులు.. భూమిపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ, తాజాగా ఏర్పడిన భారీ సౌర తుపాను భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు సైంటిస్టులు గమనించారు. జులై 3వ తేదీన భారీ సోలార్‌ ఫ్లేర్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు… దీని గమనం భూ వాతారణంపైపుకు చాలా వేగంగా ఉన్నట్లుగా తెలుసుకున్నారు.

ఏకంగా గంటకు 16 లక్ష కిలో మీటర్ల వేగంతో ఈ సౌర తుపాను వస్తున్నట్లు శాస్ర్తవేత్తలు హెచ్చరించారు. ఈ భారీ తుపాను కమ్యూనికేషన్ సిస్టంపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు రీసెర్చర్స్ అంచనా వేస్తున్నారు. ఈ తుపాను సూర్యుడి వైపు ఉన్న భూమిపై స‌బ్‌-సోలార్ పాయింట్‌లో కేంద్రీకృత‌మైన‌ట్లు అమెరికాకు చెందిన స్పేస్ వెద‌ర్ ప్రిడిక్షన్‌ సెంటర్‌ తెలిపింది.

దీని ప్రభావం జీపీఎస్‌ సిస్టంతో పాటు ఉపగ్రహాలపై తీవ్రంగా పడే అవకాశాలున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతమున్న వేగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. దాని ప్రభావానికి భూమి వెలుపల ఉన్న ఉపగ్రహాలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు.