1000 సంవత్సరాలకు పైగా చెట్టు ఎలా బతుకుతుంది? సైన్స్ విప్పిన గుట్టు ఏంటి?

కొన్ని మొక్కలు చాలా దృఢంగా ఉంటాయి. ఎంత దృఢంగా ఉంటాయంటే.. అసలు ఆక్సిజన్ లేకపోయినా బతకగలవు. అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ బ్రతుకగలవు. మరి 1000 సంవత్సరాలకు పైగా జీవించే చెట్లను ఎప్పుడైనా చూశారా? తాజాగా చెట్లపై శాస్త్రవేతలు చేసిన పరిశోధనలో 1000 సంవత్సరాలకు పైగా జీవించే చెట్లు, వాటి జీవిత కాలం వెనుక ఉన్న రహస్యాలు గురించి తెలుసుకున్నారు. అవేంటో చూద్దాం?
జింగో చెట్టు:
ఈ చెట్టు భూమి మీద ఎన్ని సంవత్సరాలు నివసిస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం. కానీ కొత్త పరిశోధన ప్రకారం.. ఈ చెట్టు 1000 సంవత్సరాలకు పైగా జీవిస్తోందని శ్రాస్తవేతలు నిరూపించారు. కొన్ని జింగో చెట్లకు 3వేల సంవత్సరాల వయస్సు ఉన్నట్లు వారి పరిశోధన ఈ చెట్టు మానవ శరీరానికి ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంది. ఈ చెట్లు వయసు పెరిగే కొద్దీ పెరగడం లేదని వారు కనుగొన్నారు.
> డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, ఆర్థరైటిస్ వంటి అనేక వయసు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులను మాయం చేసే ఔషదాలు ఈ చెట్టులో ఉన్నాయి. ఈ చెట్లు చైనాకు చెందినవి.