చెట్టు తొర్రలో గుడ్లగూబ పిల్లలు..ఎవ్వరికి కనిపించకుండా తల్లి ఎలా కాపలాకాస్తోందో..!!

South Africa Ninja Mother owl : పిల్లల్ని కాపాడుకోవటం కోవటానికి జంతువులైనా పక్షులైనా సరే తమ ప్రాణాలను పణ్ణంగా పెడతాయి. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఓ గుడ్లగూడ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చెట్టుతొర్రలో గుడ్లు పెట్టి వాటిని పొదిగి అవి పిల్లలు అయ్యాక..వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవటంలో ఈ గుడ్లగూబను చూస్తే ‘తల్లి’’అంటే అంతేగా..అనిపిస్తుంది.
చెట్టు తొర్రలో పిల్లలున్నాయి. వాటిని ఎటువంటి ప్రమాదం కాకుండా కాపలాకాసే ఈ గుడ్లగూబ మాత్రం కనిపించకుండా మాయచేస్తోంది. ఎంతో పరిశీలనగా చూస్తే తప్ప అక్కడ గుడ్లగూబ ఉందనే సంగతే తెలియటంలేదు. దీన్ని ఓ ఫోటో గ్రాఫర్ కనిపెట్టి తన కెమెరాతో క్లిక్ మనిపించాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది వైరల్ గా మారింది.
చెట్టు తొర్ర పక్కనే అస్సలు కనిపించకుండా ఉన్న ఆ గుడ్లగూడను ఫోటో గ్రామఫర్ అతికష్టంమీద కనిపెట్టి తన కెమెరాకు పనిచెప్పాడు. ఆ తల్లి గుడ్లగూబ నైపుణ్యాన్ని కెమెరా కంటిలో బంధించి అందరికీ చూపించాడు. ఈ ఫొటోలు చూసిన వాళ్లంతా ఇదేదో నింజా గుడ్లగూబలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఓ చిన్న అటవీప్రాంతంలో నూర్దాక్ కామన్ అనే ప్రాంతానికి ఇది చాలా దగ్గరగా ఈ నింజా గుడ్లగూబ ఓ చెట్టు తొర్రలో గుడ్లు పెట్టి పొదిగింది. అవి పిల్లలయ్యాయి. స్థానికంగా నివశించే రాబ్ మోస్లీ అనే ఫొటోగ్రాఫర్‌కు తన ఫ్రెండ్ ద్వారా ఈ గుడ్లగూబల విషయం తెలిసింది. భలే ఉందా గుడ్లగూబ పనితనం దాన్ని ఫోటోలు తీయమని చెప్పింది. దీంతో కెమెరా వేసుకుని ఈ గుడ్లగూబ గూడు వద్దకు వెళ్లాడు.ఆ గూడు దగ్గరలోని మగగూబ తచ్చట్లాడుతూ కాపలాకాస్తోంది.
అదేసమయంలో ఆడగూబ గూడుకు అడ్డుగా నిలబడి పిల్లల్ని రక్షిస్తోంది. ఇలా కాపాడుకునే క్రమంలో చెట్టుకు ఆనుకొని..దాదాపు అతుక్కుపోయినట్లుగా..చెట్టులో భాగమైపోయినట్లుగా దాక్కుంటోంది. ఆ చెట్టు కలర్ లోనే ఆ గుడ్లగూబ కూడా ఉండటంతో అక్కడ అది ఉందనే విషయమే తెలియటంలేదు. ఆ సమయంలో గనుక దాన్ని చూస్తే అక్కడ గుడ్లగూబ ఉందా? లేదా? అనే డౌట్ వచ్చేస్తుంది. అంతలా చెట్టులో కలిసిపోయిందా తల్లి గుడ్లగూబ.
ఇక్కడ తిరుగుతుండే మనుషులకు ఈ గుడ్లగూబ అలవాటు పడిపోయిందట. అందుకే తన గూటికి దగ్గరగా మనుషులు వచ్చినా పెద్దగా పట్టించుకోవడంలేదట. కానీ దాని గూడుకు మరింత దగ్గరగా వెళితే మాత్రం దాని పెద్ద పెద్ద కళ్లను మరింత పెద్దగా చేసి చూస్తూ.. కోపంగా చూస్తోందని ఫోటో గ్రామఫర్ మోస్లీ తెలిపారు.
ఈ తల్లి గుడ్లగూబ గూడు దగ్గర లేనప్పుడు పిల్లలు కొద్దిగా బయటకు వచ్చి గూట్లోనుంచి తొంగి చూస్తున్నా దృశ్యాలను కూడా మోస్లీ తన కెమెరాతో క్లిక్ మనిపించారు. ఈ గుడ్లగూబ పిల్లలు చాలా ముద్దుగా ఉన్నాయని..మోస్లీ తెలిపారు.