కరోనా నుంచి కాపాడుకోవడానికి రెస్టారెంట్స్‌లో బబుల్స్ టెక్నిక్

కరోనా నుంచి కాపాడుకోవడానికి రెస్టారెంట్స్‌లో బబుల్స్ టెక్నిక్

Updated On : September 26, 2020 / 5:41 PM IST

కరోనాతో బిజినెస్ మూతపడకుండా న్యూయార్క్ బిస్ట్రో కొత్త బిజినెస్ ట్రిక్ వాడుతుంది. కరోనావైరస్ కు కవచంలా పనిచేసేందుకు బబుల్స్ ను వాడుతుంది. మాస్క్ లు లేకుండా ఉండడంతో పాటు కస్టమర్లు స్వేచ్ఛగా మాట్లాడుకోడానికి ఈ బబుల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. మన్‌హటన్ అప్పర్ వెస్ట్ సైడ్‌పై ఉన్న కేఫ్ డు సొలీల్ లో ప్లాస్టిక్ టెంట్లు వేసి నిర్వహిస్తున్నారు. వాతావరణం చల్లగా ఉన్నా.. తడిగా ఉన్నా ఒకటే అన్నట్లు ఉంది.

‘ఈ ప్రపంచంలో పలు అంశాలు జరుగుతూనే ఉన్నా.. బబుల్ లోపల కూర్చొని తినడం అనేది ఓ కొత్త బెస్ట్ ఎక్స్‌పీరియన్స్’ అని వేలెరీ వర్తీ అంటున్నారు. ‘ప్రతీది సేఫ్ గా ఉంచుకోగల్గుతున్నారు. వస్తువులు అన్నీ ఆరడుగుల దూరంలోనే ఉంటున్నాయి’ అని వర్తీ చెప్పుకొచ్చారు.



కరోనావైరస్‌ను దృష్టిలో ఉంచుకుని న్యూయార్క్ లో వేలకొద్దీ రెస్టారెంట్లు అన్ని అవుట్ డోర్ డైనింగ్ కే మొగ్గుచూపుతున్నాయి. అక్కడి మేయర్ బిల్ డె బ్లాసియో శుక్రవారం ఇదే పద్ధతిని అంతా అమలు చేసి కరోనావైరస్ ను పారద్రోలాలంటూ క్లాస్ పీకుతున్నారు.

ఇండోర్ హోటల్స్ తినడం వల్ల వైరస్ అక్కడే ఉంటుందని.. పైగా కెపాసిటీ కూడా తగ్గించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలా బబుల్స్ ఉంటే చలి, వర్షం, మంచు నుంచి కూడా కాపాడొచ్చని అంటున్నారు. ఫ్యామిలీలు, పిల్లలు దీనిని బాగా ప్రేమిస్తున్నారు. కలిసి టైం స్పెండ్ చేయాలనుకునేవారు దీనిని బాగా ప్రేమిస్తున్నారు.

ఈ బబుల్స్ లోపల టైం స్పెండ్ చేయడమనేది మంచి ఇంటరెస్టింగ్ టాపిక్. ఇలా ఎంతమంది ఉన్నా స్వేచ్ఛగా తిరిగేయగలమని ఆమె చెప్పుకొచ్చింది.