NASA SpaceX’s : డైపర్లు వేసుకున్న వ్యోమగాములు..!! ఎందుకంటే

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన వ్యోమగాములు డైపర్లు వేసుకున్నారు.

NASA spacex crew2 return to earth with toilet problem : అంతరిక్షయానం అంటే మాటలు కాదు. ఎంత ట్రైనింగ్ తీసుకున్నా ఆకాశంలోకి వెళ్లినవారు సురక్షితంగా తిరిగి రావాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు టెక్నికల్ సమస్యలు. మరికొన్ని సార్లు అనుకోను అవాంతరాలు వస్తుంటాయి.వీటన్నింటికి సిద్ధపడి..అనుకోకుండా వచ్చి పడే సమస్యల్ని అధిగమించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటిదే జరిగింది ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌ రూపొందించిన డ్రాగన్‌ వ్యోమనౌకలో..

డ్రాగన్‌ వ్యోమనౌకలో ఆరు నెలల క్రితం నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌ (International Space Station)కు చేరుకున్నారు. అక్కడకు వెళ్లిన వ్యోమగాములు అనేక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.అనంతరం వచ్చే సోమవారం (నవంబర్ 8,2021) ఉదయం భూమికి చేరుకోవాల్సి ఉంది. కానీ ఇంతలోనే వారికి అనుకోని అవాంతరం ఏర్పడింది. ఊహించని సమస్య ఎదురవ్వటంతో వ్యోమగాములు కాస్త ఇబ్బందులకు గురయ్యారు. టెక్నికల్ ప్రాబ్లమ్ అయితే చిటికెలో సాల్వ్ చేసేసేవారే. కానీ పాపం అది బాత్రూమ్ సమస్య అయ్యింది.

Read more :China : విజయవంతంగా 90రోజుల అంతరిక్ష యాత్ర..భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు.. 

వ్యోమగాముల్ని తీసుకెళ్లిన క్రూ డ్రాగన్‌ క్యాప్సూల్‌లోని బాత్‌రూంలో ఉండే మూత్రపు గొట్టం ఊడిపోయింది. దీంతో పెద్ద చిక్కే వచ్చి పండింది. దాంట్లో ఉన్న మూత్రం అంతా క్యాప్సూల్‌ అడుగున పడింది. దీన్ని గుర్తించిన వ్యోమగాములు వేరే దారిలేక తాత్కాలికంగా ఆ సమస్యను పరిష్కరించుకున్నారు. కానీ వారు తిరిగి భూమ్మీదకు వచ్చే ప్రయాణంలో మాత్రం వస్తే బాత్రూమ్ ని ఉపయోగించుకోని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి తిరుగు ప్రయాణం కష్టమైపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వారి తిరుగు ప్రయాణం 20గంటలపాటు సాగాలి మరి. దీంతో పాపం వారేం చేస్తారు? బాత్రూమ్ కు వెళ్లలేరు. అలాగని ఆపుకోనులేదు. దీంతో ‘అబ్జార్బెంట్‌ అండర్‌గార్మెంట్స్‌’.. ఒకరకంగా చెప్పాలంటే డైపర్లు ఉపయోగించాలను అనుకున్నారు. అదే విషయాన్ని వ్యోమగాములే తెలిపారు. లేదంటే 20 గంటలపాటు బాత్రూమ్ లేకుండా ఎలా ఉంటారు మరి. తప్పదు మరి.

Read more : Moon Tourism : హలో వస్తారా..చందమామపైకి టూర్..5 కంపెనీలతో నాసా ఒప్పందం

ఐఎస్ఎస్ లో పని పూర్తి చేసుకుని భూమికి తిరిగి రావాల్సిన వారిలో మెక్‌ఆర్థర్‌ అనే మహిళా వ్యోమగామి కూడా ఉన్నారు. పాపం ఈ పరిస్థితిలో ఆమె మాత్రం ఏం చేయగలరు? కానీ మగవారితో పాటు ఆడవారు కూడా వ్యోమగాములగా రాణిస్తున్నారు. ఆకాశంలో గెలుపు సంతకం చేస్తున్నారు. టెక్నికల్ సమస్యలతో పాటు ఇటువంటి సమస్యలు వస్తే ఏం చేయాలో? ఎలా ఉండాలో వారికి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అందుకే మెక్ ఆర్థర్ ఏమాత్రం ఇబ్బంది పడలేదు. వచ్చిన సమస్యను ఎదుర్కొంటామని చెబుతున్నారామె.

ఈ సమస్యపై ఆమె మాట్లాడుతూ..‘‘అంతరిక్షయానం అంటే అనేక సవాు. ఊహించనివి ఎదురవుతుంటాయి. అటువంటిలో ఇదికూడా ఒకటి.దీన్ని మేం సమర్థంగా ఎదుర్కొంటాం. కాస్త ఇబ్బందే కానీ తప్పదు. మేం అంతా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాం’’ అని తెలిపారు. తాము ఇబ్బంది పడినా క్యాప్యూల్ కు భద్రతకు ఎటువంటి ఇబ్బంది రానివ్వమని చెబుతున్నారు.

Read more : TikTok Star : 2027 నాటికి భూమిపై ఇతనొక్కడే బతికి ఉంటాడట..!

ఈ వ్యోమనౌకలో ఉన్న మెక్‌ఆర్థర్‌తో పాటు ఫ్రాన్స్‌కు చెందిన థామస్‌ పెస్కెట్‌, నాసాకు చెందిన షేన్‌ కింబ్రో, జపాన్‌కు చెందిన అకిహికో హోషిడే ఈ ఆదివారం భూమి పైకి చేరుకోనున్నారు. కాలిఫోర్నియా కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 10 గంటలకు వీరు ఐఎస్‌ఎస్‌ నుంచి బయలుదేరుతారు. సోమవారం ఉదయం 4 గంటల సమయంలో ఫ్లోరిడా సమీపంలోని అట్లాంటిక్‌ మహాసముద్ర తీరంలో క్యాప్సూల్‌ దిగనుంది.

ఇదిలా ఉంటే వీరి స్థానంలో ముగ్గురు వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు పంపాలని ఇప్పటికే స్పేస్‌ఎక్స్‌ ప్లాన్ సిద్ధం చేసింది. గత శనివారమే వీరు బయలుదేరాల్సి ఉండగా.. ప్రతికూల వాతావరణం, వ్యోమగాముల్లో ఒకరికి అనారోగ్యం కారణంగా అది వాయిదా పడింది.

ట్రెండింగ్ వార్తలు