త్రిశూల వ్యూహం అమలు చేస్తున్న ఇజ్రాయెల్..! అసలేంటి వ్యూహం? హమాస్, హెజ్బొల్లాను ఎలా దెబ్బకొట్టనుంది?
ఇజ్రాయెల్ పై హమాస్ కు మద్దతుగా హెజ్ బొల్లా చాలా పవర్ ఫుల్ వెపన్లనే యుద్ధంలో వాడుతోంది.

Israel Hezbollah War : లాస్ట్ పంచ్ తనదైతే.. ఆ కిక్కే వేరంటోంది ఇజ్రాయెల్. లాస్ట్ పంచ్ ఎంత గట్టిగా కొట్టాలంటే.. దెబ్బకు హమాస్ ఖల్లాస్ అయిపోవాలి. హెజ్బొల్లా తోక ముడిచేసి కాల గర్భంలో కలిసిపోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ స్కెచ్ అదే. ఇంతకీ నెతన్యాహు ప్లాన్ ఏంటి? నెక్ట్స్ వార్ టార్గెట్స్ ఏంటి?
ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే ఇజ్రాయెల్ అంటోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ప్రత్యర్థులపై సైన్యం దూకుడు ఒకవైపు, టాప్ హమాస్ లీడర్లను లేపేయడం మరోవైపు.. హెజ్బొల్లా ఆర్థిక మూలాలను సమూలంగా నాశనం చేయడం ఇంకోవైపు.. మొత్తానికి ఇజ్రాయెల్ త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
హమాస్.. దానికి సపోర్ట్ గా ఉన్న హెజ్బొల్లా.. దానికి చాటుగా ఆర్థిక అంగబలం, ఆయుధ సాయాన్ని అందిస్తూ నడిపిస్తున్న ఇరాన్.. వీటన్నింటికి ఒకే దెబ్బతో చెక్ పెట్టడానికి త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తోంది ఇజ్రాయెల్. త్వరల్ హెజ్ బొల్లా ఆర్థిక మూలాలను, ఆయుధ సంపత్తిని సమూలంగా నాశనం చేయబోతున్నామని నెతన్యాహు ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. డ్రోన్ అటాక్స్, రాకెట్ లాంచర్లు చేసే వీలు లేకుండా కోలుకోలేని దెబ్బ కొడతామని వార్నింగ్ ఇచ్చింది.
ఇజ్రాయెల్ పై హమాస్ కు మద్దతుగా హెజ్ బొల్లా చాలా పవర్ ఫుల్ వెపన్లనే యుద్ధంలో వాడుతోంది. గతేడాది గాజా స్ట్రిప్ లో దాడులకు దాదాపు 10వేలకు పైగా ఆయుధాలను హెజ్ బొల్లాకు ఇరాన్ అందించినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అందుకే ఫైనాన్షియల్ సెంటర్లను ఏరివేసే పనిలో పడింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.
అల్ ఖర్ద్ అల్ హసన్.. హెజ్ బొల్లాకు ఆర్థికసాయం అందిస్తోంది. ఇదొక స్వచ్చంద సంస్థ పేరుతో నిర్వహించే బ్యాంక్ గా చెబుతున్నారు. హెజ్బొల్లా సైనికులకు ఈ బ్యాంకు నుంచి జీతాల సొమ్ము జమ అవుతోంది. ఇదే బ్యాంకు అక్కడి కార్మిక వర్గ షియా ముస్లిం కుటుంబాలకు కూడా వడ్డీ లేని రుణాలను ఇస్తోంది. లెబనాన్ లోని ప్రజలకు ఆర్థిక అవసరాలను తీర్చుతూ ఒక రకంగా ప్రజల మద్దతు కూడా అల్ ఖర్ద్ అల్ హసన్ బ్యాంకు కూడగడుతోంది. కానీ, ఈ ఆర్థిక సంస్థను ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల కోసమే హెజ్ బొల్లా వాడుతోందని ఇజ్రాయెల్, అమెరికా ఆరోపిస్తున్నాయి.
హెజ్ బొల్లా టెర్రర్ గ్రూపులకు ఇక్కడి నుంచే కావాల్సినంత ఆర్థిక సాయం అందుతోంది. బంగారం రూపంలోనూ నిధులన సమకూర్చుతోంది. యుద్ధానికి కావాల్సిన అత్యాధునిక ఆయుధ కొనుగోళ్లను కూడా అల్ ఖర్గ్ అల్ హసన్ ద్వారానే చేస్తున్నట్లు చెబుతున్నారు. హెజ్ బొల్లా దీన్ని చూసుకునే ఇజ్రాయెల్ పై తొడ కొడుతూ, మీసం మెలేస్తోందని అంటున్నారు. ఈ అండర్ గ్రౌండ్ స్థావరాలను ఒక్కొక్కటిగా కూలగొడితే అప్పుడు హెజ్ బొల్లా కాళ్లు, చేతులు, మెడలను కత్తిరించినట్లు అవుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది.
Also Read : 2025లో యుగాంతమేనా? భయపెడుతున్న వంగా బాబా, నోస్ట్రడామస్ జోతిష్యం..! నిజమెంత?