రెండు దేశాల బంధానికి బ్రేకప్..! పాకిస్తాన్‌పై చైనా ఆగ్రహానికి కారణం ఏమిటి?
ఏ ప్రాజెక్ట్ తో అయితే, రెండు దేశాల మధ్య బంధం కలిసిందో అదే ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు చైనాకు కోపం తెప్పిస్తున్నాయి.

China Pakistan Issue : హిమాలయాలకంటే ఎత్తుగా, సముద్రం కంటే లోతుగా.. తేనె కంటే తియ్యనైన బంధం.. చైనాతో రిలేషన్స్ గురించి పాకిస్తాన్ పదే పదే చెప్పే మాట ఇదే. అలాంటి బంధం బీటలు వారుతోందా? రెండు దేశాలు లెట్స్ బ్రేకప్ అనుకోబోతున్నాయా? అసలు పాకిస్తాన్ ను చైనా ఎందుకు బహిరంగంగా తిట్టింది? రెండు దేశాల మధ్య అసలేం జరుగుతోంది? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
భారత్ అంటే రగిలిపోయే పాకిస్తాన్, చైనా.. దోస్త్ మేరా దోస్త్ అంటూ కొన్ని రోజులుగా చెట్టాపటాల్ వేసుకుని తిరుగుతున్నాయి. పాక్ ను నిలబెడతామంటూ ఆ దేశంలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి ఈ రెండు దేశాలు. అయితే, విడదీయని బంధం లెవెల్ లో అల్లుకుపోయిన చైనా పాకిస్తాన్ బంధానికి ఇప్పుడు బీటలు వచ్చాయా? లెట్స్ బ్రేకప్ అనుకునేందుకు సిద్ధమవుతున్నాయా? అన్న చర్చ జరుగుతోంది.
ఏ ప్రాజెక్ట్ తో అయితే, రెండు దేశాల మధ్య బంధం కలిసిందో అదే ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు చైనాకు కోపం తెప్పిస్తున్నాయి. ఇలా అయితే కుదరదు అని పాక్ ను బహిరంగంగానే తిట్టే పరిస్థితికి వెళ్లింది. దీంతో రెండు దేశాల బంధం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది.
పాకిస్తాన్ లో ఉన్న తమ పౌరుల భద్రతకు సంబంధించి చైనా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గత 6 నెలల్లో రెండుసార్లు చైనా పౌరులను టార్గెట్ చేసుకుని తీవ్రవాదులు దాడులు చేశారు. ఇదే డ్రాగన్ కంట్రీకి కోపం తెప్పిస్తోంది. ఇలాంటివి అంగీకరించేది లేదని.. మీరు మారతారా? మమ్మల్ని దూరం అవమంటారా? అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు తీవ్రవాదుల దాడుల్లో ఆరుగురు చైనా పౌరులు చనిపోయారు. దీంతో పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది చైనా.
భద్రతాపరమైన సమస్యలు ఉంటే ఆ ప్రాంతానికి, దేశానికి తమ ప్రతినిధులను అస్సలు పంపించబోమని, ఈ విషయంలో నమ్మి ఒక్క దేశానికే మినహాయింపు ఇస్తే ఇలా చేస్తారా అంటూ పాక్ కు గట్టిగా క్లాస్ పీకింది చైనా. ఇదే కొనసాగితే ఈ ప్రభావం పెట్టుబడుల మీద పడే ఛాన్స్ ఉంటుందని, ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
సీపెన్.. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ కోసం డ్రాగన్ కంట్రీ మిలియన్ల కొద్దీ డబ్బు ఖర్చు చేస్తోంది. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు అప్పులు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తోంది.
జిగిరీ దోస్తులు చైనా, పాక్ బంధంలో ఇప్పుడు రఫ్ తేజ్ కనిపిస్తోంది. అసలేంటి సీపెక్ ప్రాజెక్ట్? ఎందుకు అది ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది? పాక్ ను చైనా తిట్టడం వెనుక కేవలం భద్రతా సమస్యలు మాత్రమే కారణం కాదా? అసలు విషయం వేరే ఉందా?
Also Read : వార్‌కు రెడీ..! ఏ క్షణమైనా దాడులకు దిగుతామంటూ ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్..!