ప్రతీకారం: న్యూజిలాండ్ ఘటనకు రివేంజ్‌గా శ్రీలంకలో దాడులు

  • Published By: vamsi ,Published On : April 23, 2019 / 02:25 PM IST
ప్రతీకారం: న్యూజిలాండ్ ఘటనకు రివేంజ్‌గా శ్రీలంకలో దాడులు

Updated On : April 23, 2019 / 2:25 PM IST

శ్రీలంకలో జరిగిన మారణహోమం తామే చేసినట్లుగా ఇప్పటికే ఐసీస్ ప్రకటించుకుంది. అయితే న్యూజిలాండ్‌ మ‌సీదుల్లో కాల్పుల ఘటనకు ప్రతీకారంగానే శ్రీలంకలో ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడ్డారని ప్రాథమిక నివేదికలో తెలిసినట్లు శ్రీలంక‌ రక్షణ మంత్రి రువాన్ విజయవర్దనే వెల్లడాంచారు. ఈ మేరకు ఆ దేశ పార్లమెంటులో మంగళవారం(23 ఏప్రిల్ 2019) ప్రకటనను విడుదల చేసిన మంత్రి.. క్రిస్టియన్లే టార్గెట్‌గా ఈ దాడులు చేసినట్లు తెలిపారు.
Also Read : సీసీ కెమెరాల్లో సూసైడ్ బాంబర్ : ఆత్మాహుతికి ముందు పిల్లలతో ముచ్చట్లు ​​​​​​​

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చ‌ర్చ్‌లోని మసీదులో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడగా.. ఆ ఘటనలో 50 మంది చనిపోయారు. ఐసిస్ ఉగ్రవాదానికి ప్రతీకారంగా ఈ దాడులు నిర్వహించినట్లు నాడు నిందితుడు తెలపగా.. దానికి బదులు తీసుకుంటామని ఐసిస్ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించింది. అందుకు తగినట్టే శ్రీలంక రాజధాని కొలంబోలో దాడులకు ప్లాన్ చేసినట్లు మంత్రి తెలిపారు. 

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్)కు చెందిన వెబ్‌సైట్‌లోనూ ప్రతీకార అంశం ఉన్నట్లు విచార‌ణ అధికారులు గుర్తించారు. పేలుళ్ల కేసులో ఇప్పటికి 24 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న శ్రీలంక పోలీసులు పేలుళ్లతో సంబంధం ఉన్న నైజీరియన్‌ను అరెస్ట్ చేశారు. దేశ ర‌క్షణ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నట్లు శ్రీలంక రక్షణ మంత్రి అంగీక‌రించారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులను అంతమొందించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే  కొలంబో పేలుళ్లలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 320కి చేరగా.. అందులో 38 మంది విదేశీయులు ఉన్నారు. మృతుల్లో భారతీయుల సంఖ్య 10కి పెరిగింది.
Also Read : అపార్ట్‌మెంట్‌లో అలజడి : పార్కింగ్‌లో పేలిన టెస్లా కారు