శ్రీలంకలో పేలుడు జరిగిందిలా!

శ్రీలంకలో ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉదయం నుంచి రాజధాని కొలంబోలో హోటల్స్,చర్చిలు లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 215మంది వరకు మృతి చెందగా 500మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటి వరకు తొమ్మిది చోట్ల బాంబు దాడులు జరిగాయి. 
ఉదయం కోచికడేలో సెయింట్ ఆంటోనీ చర్చిలో జరిగిన పేలుడు ఘటనను కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.శ్రీలంకలో ఉగ్రదాడిని ప్రపంచదేశాలు ముక్తకంఠంతో ఖండించాయి.