Taliban in Afghanistan: గొంతు కోసి.. కండలు కోసేసి తొమ్మిది మందిని చంపిన తాలిబాన్

అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించిన తాలిబాన్లు.. టార్చర్ చేసి తొమ్మిది మందిని హత్య చేశారు. జులై నెలారంభంలో ఘాజ్నీ అనే ప్రాంతంలో ఇళ్లను దోపిడీ చేసి ఈ ఘటన..

Taliban Fighters (1)

Taliban in Afghanistan: అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించిన తాలిబాన్లు.. టార్చర్ చేసి తొమ్మిది మందిని హత్య చేశారు. జులై నెలారంభంలో ఘాజ్నీ అనే ప్రాంతంలో ఇళ్లను దోపిడీ చేసి ఈ ఘటనకు పాల్పడ్డారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవ హక్కుల గ్రూప్ చెప్పింది. ఆమ్నెస్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ దారుణ హత్యలకు అనేకమంది సాక్ష్యులుగా నిలిచారు. జులై 4, జులై 5వ తేదీల్లో మలిస్తాన్ జిల్లాలోని ముందరాఖ్త్ గ్రామంలో ఈ ఘటనలు జరిగాయని చెప్పారు.

అందులో ఆరుగురు స్పాట్ లోనే చనిపోగా, మరో ముగ్గురిని టార్చర్ చేసి చంపారు. షియా ఇస్లాంను పాటించే హజారా కమ్యూనిటీకి చెందిన వ్యక్తులను హత్య చేశారు. సున్నీ పద్ధతిని పాటించే అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో చాలా రోజులుగా వివక్ష చూపిస్తున్నారు.

ఆమ్నెస్టీ సెక్రటరీ జనరల్ ఏగ్నెస్ కలామర్ద్ మాట్లాడుతూ.. ‘ఇదంతా తాలిబాన్ పాస్ట్ రికార్డ్, మరోసారి తాలిబాన్లు అలా చేస్తారనే సూచనలు కనిపిస్తున్నాయి. అఫ్ఘాన్ బలగాలు.. తాలిబాన్ ఫైటర్లు కలిసి ఘాజ్నీ ప్రాంతాన్ని 2021 జులై 3న భయాందోళనలకు గురి చేశాయి. ఓ 30 కుటుంబాలు తల దాచుకోవడానికి కొండల్లోకి.. నిర్మానుష్య ప్రాంతాలకు పారిపోయారు.

ఏదేమైనా ఆకలి కొంతమందిని తిరిగి ఇళ్లకు వెళ్లేలా చేసింది. అప్పుడే తెలిసింది తాలిబాన్లు వారి ఇళ్లను ధ్వంసం చేశారని.. కొందరేమో తిరిగి వెళ్తే తమను చంపేస్తారని భయం వేసి అక్కడే ఆగిపోయారు. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన దానిని బట్టి.. 63ఏళ్ల వ్యక్తి గొంతుకోసి అతని స్కార్ఫ్ తోనే ప్రాణం తీశారు. శరీరంలోని కండ భాగాన్ని కోసేశారు. అలా చాలా శవాలను దగ్గర్లోని కాలువల్లోకి విసిరేశారు.

విరిగిన చేతులు, కాళ్లను సేకరించి వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు స్థానికులు. ఇలా ఎందుకు చేశారని వాళ్లని అడిగితే.. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు చావాల్సిందే. మీ దగ్గర తుపాకులు ఉన్నాయా లేదా అనేది విషయం కాదు. ఇది యుద్ధ సమయం’ అని చెప్పారట.

ఈ ఉద్దేశ్యపూర్వకమైన హత్యల వెనుక సంప్రదాయ, మత సిద్ధాంత మైనారిటీలు రిస్క్ లో ఉన్నట్లు తెలుస్తుందని ఏగ్నెస్ కలామర్ద్ అంటున్నారు. ఆ ఏరియాల్లో మొబైల్ ఫోన్స్ కూడా లాక్కొని వారు చేసిన హత్యలు బయటకు పోకుండా జాగ్రత్త పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు.