Ecuador Earthquake: దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన ఇళ్లు, 14 మంది మృతి
దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్, ఉత్తర పెరూలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. ఈ భూకంపం దాటికి ఈక్వెడార్‌లో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపం దాటికి ఈక్వెడార్ ప్రాంతాల్లో 13మంది మరణించగా, పెరూలో ఒకరు మరణించారు.

Ecuador earthquake
Ecuador Earthquake: దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్, ఉత్తర పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.7 గా నమోదైంది. భూకంప కేంద్రం గుయాస్‌కు దక్షిణంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈక్వెడార్ ప్రెసిడెంట్ గిల్లెర్మో లాస్సో స్పందిస్తూ.. ప్రజలు ఆందోళన చెందొద్దని, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు. గాయపడిన వ్యక్తులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధ్యక్షుడి కార్యాలయం ధృవీకరించింది.
Earthquake In Kurnool: కర్నూలు జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో తెల్లవార్లు రోడ్లపైనే ప్రజల జాగరణ
భూకంపం దాటికి కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో రహదారులు మూసుకుపోయాయని, పలు ఇళ్లు, విద్యాలయ భవనాలు, ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు క్యూన్కా నగరంలో కారుపై గోడకూలి ఒక వ్యక్తి మరణించగా, జంబెలీ ద్వీపంలో టవర్ కూలి ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. అదేవిధంగా మనాబి, మాంటా, రాజధాని క్విటోతో సహా అనేక నగరాల్లో కూడా భూకంప ప్రభావం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. వీరిలో ఈక్వెడార్ లో 13 మంది, పెరూలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Earthquake In Turkey : టర్కీలో ఆగని భూప్రకంపనలు.. రాత్రంతా కంపించిన భూమి.. గంటల వ్యవధిలో 32 సార్లు
2016 సంవత్సరం తరువాత ఈక్వెడార్ లో సంభవించిన బలమైన భూకంపం ఇదేనని అధికారులు తెలిపారు. 2016 సమయంలో భూకంపం సంభవించినప్పుడు దాదాపు 700 మంది మరణించగా, వేల మంది గాయపడ్డారు.