Students Kidnap
Students: నైజీరియాలోని ఒక పాఠశాల నుంచి రెండు వందల మంది విద్యార్థులు కిడ్నాప్ అవడం సంచలనంగా మారింది. కేంద్రరాష్ట్రమైన నైజర్‌లోని తెగినాలోని ఇస్లామిక్ పాఠశాలపై దాడి చేసిన దుండగులు 200మంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు. మారణాయుధాలతో వచ్చిన ముష్కరులు పాఠశాలపై దాడి చేశారని, ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
విద్యార్థులకోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. డబ్బు కోసం కిడ్నాప్ చేస్తున్న సాయుధ బృందాలు ఇటీవలి నెలల్లో ఉత్తర నైజీరియాలోని పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలపై వరుసగా దాడులు చేస్తన్నాయి. డిసెంబర్ నుంచి విమోచన కోసం 700 మందికి పైగా విద్యార్థులను అపహరించాయి.
నైజీరియాలోని నీజర్ రాష్ట్రంలో టెజీనా నగరంలోని ఒక పాఠశాల నుంచి ఈ మేరకు విద్యార్థులను కిడ్నాప్ చేశారు. 200మంది విద్యార్థులను అపహరించారు అని చెబుతున్నప్పటికీ స్పష్టంగా లెక్క తెలీలేదని నీజర్ రాష్ట్ర అధికారులు తెలిపారు. 200మంది విద్యార్థులు స్కూల్లో కనిపించకుండా పోయారని ఒక టీచర్ చెప్పారు. నైజీరియా ఉత్తర రాష్ట్రాల్లో డబ్బు కోసం స్కూలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్న కేసులు ఇటీవల పెరుగుతున్నాయి.
ఈ స్కూలుకు ఎక్కువగా 6-18 ఏళ్ల బాలబాలికలు హాజరవుతూ ఉంటారు. డిసెంబర్ నుంచి నైజీరియాలో కనీసం ఆరుసార్లు ఇలాంటి కిడ్నాప్‌లు జరిగాయని, ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నట్లుగా ఇంటర్నేషనల్ మీడియా చెబుతుంది.