United States : అమెరికాలో గ్రీన్ కార్డు అందకముందే 4 లక్షల మంది భారతీయులు చనిపోతారట.. కొత్త నివేదిక ఏం చెబుతోందంటే?

యుఎస్‌లో దీర్ఘకాలిక గ్రీన్ కార్డ్ నిరీక్షణ సమయం సంక్షోభంగామారుతోంది. గ్రీన్ కార్డు అందకముందే 4 లక్షల మంది భారతీయులు చనిపోతారని కొత్త నివేదిక చెబుతోంది.

United States  : అమెరికాలో గ్రీన్ కార్డు అందకముందే 4 లక్షల మంది భారతీయులు చనిపోతారట.. కొత్త నివేదిక ఏం చెబుతోందంటే?

United States

Updated On : September 6, 2023 / 1:46 PM IST

United States : అమెరికాలో గ్రీన్ కార్డు అందకముందే 4 లక్షల మంది భారతీయులు చనిపోతారట. ఇప్పటికే గ్రీన్ కార్డు కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని కొత్త నివేదిక చెబుతోంది.  గ్రీన్ కార్డ్ లేదా పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ అనేది US వలసదారులకు దేశంలో శాశ్వత నివాసం మంజూరు చేస్తూ ఇచ్చే పత్రం.  దీనిపై ప్రస్తుత బిడెన్ పరిపాలనలో ప్రయత్నాలు చేసినప్పటికీ భారతీయ దరఖాస్తుదారులను అయోమయంలో పడేస్తోంది.

Watermelons : వామ్మో ..అమెరికాలో బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు, అసలేం జరుగుతోంది..?

అమెరికాలో ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న మొత్తం 18 లక్షల గ్రీన్ కార్డ్ దరఖాస్తుల్లో 63% భారతీయులవే ఉన్నాయని అమెరికాకు చెందిన థింక్ కాటో ఇన్‌స్టిట్యూట్ నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం భారత్ నుండి కొత్త దరఖాస్తుదారులకు 134 సంవత్సరాల కంటే ఎక్కువ నిరీక్షణ అవసరమవుతుందట. అంటే జీవితకాలం దాటిపోతుంది. సుమారు 4,24,000 మంది ఉపాధి ఆధారిత దరఖాస్తుదారులు వేచి ఉండి చనిపోతారట. వారిలో 90 శాతం మంది భారతీయులు ఉంటారట.  అమెరికా గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తూ 4 లక్షల మంది భారతీయులు చనిపోతున్నారని ఈ కొత్త నివేదిక చెబుతోంది.

Near Death Experience: ఆత్మలు ఉన్నాయి,మరణం తరువాత మరో జీవితం ఉంది : రుజువులున్నాయంటున్న అమెరికా డాక్టర్

ఉపాధి మీద ఆధారపడే వారికి జారీ చేసే గ్రీన్ కార్డ్‌లలో  ఏటా ఒక దేశం నుంచి 7 శాతం మాత్రమే వ్యక్తులకు అందిస్తారు. ఇది కూడా అత్యంత నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది.  ప్రస్తుత పరిస్థితుల్లో గణనీయమైన ప్రతికూలత కనిపిస్తోంది.  బిడెన్ పరిపాలనలో భారతీయ-అమెరికన్ చట్టసభల చొరవ ఉన్నప్పటికీ US గ్రీన్ కార్డు నిరీక్షణ సమయం మాత్రం ఓ సంక్షోభంలా మారింది.