Charlie Kirk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హంతకుడు అరెస్ట్ అయ్యాడు. కిల్లర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
చార్లీ కిర్క్ పై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ధృవీకరించారు. “నాకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి అతడిని అప్పగించాడు. దీనిపై ఎఫ్ బీఐ అధికారిక ప్రకటన వస్తుంది” అని ట్రంప్ వెల్లడించారు. కిర్క్ హంతకుడికి మరణశిక్ష పడుతుందని తాను ఆశిస్తున్నానని ట్రంప్ అన్నారు. చార్లీ కిర్క్ హత్యలో అనుమానితుడి వయసు 28 లేదా 29 ఏళ్లు ఉండొచ్చని ట్రంప్ పేర్కొన్నారు.
బుధవారం జరిగిన కాల్పుల్లో చార్లీ కిర్క్ మరణించాడు. లక్ష్యంగా చేసుకున్న దాడిగా పోలీసులు ఈ దాడిని అభివర్ణించారు. ఉటా గవర్నర్ దీనిని రాజకీయ హత్యగా అభివర్ణించారు. ట్రంప్ సన్నిహిత మిత్రుడు అయిన కిర్క్, లాభాపేక్షలేని రాజకీయ సంస్థ టర్నింగ్ పాయింట్ USAను స్థాపించాడు.
ఉటా విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తుండగా చార్లీ కిర్క్ (31) దారుణ హత్యకు గురయ్యారు. కాల్పులు జరగడంతో అక్కడున్న పబ్లిక్ ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో గందరగోళం ఏర్పడింది. ఇదే అదనుగా హంతకుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. చార్లీ కిర్క్ పై కాల్పులు జరపడం వెనుక అతడి ఉద్దేశం ఏంటన్న విషయంపై కూడా అధికారులు ఇప్పటివరకు చెప్పలేదు.
Also Read: అమెరికాలో భారత సంతతి వ్యక్తి తలను నరికేసిన తోటి ఉద్యోగి.. అక్కడితోనూ ఆగకుండా..