Talibans IPL : తాలిబన్ల మరో సంచలన నిర్ణయం, ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం.. మహిళలే కారణమట

క్రీడలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవంటూనే మహిళల పేర్లు చెప్పి రాక్షస పాలన అమలు చేస్తున్నారు. తాజాగా మహిళల అశ్లీలతను సాకుగా చూపి ప్రపంచ క్రికెట్‌ పండుగ అయిన ఐపీఎల్..

Talibans Ipl

Talibans IPL : అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలకు, పిచ్చి నిర్ణయాలకు అంతు లేకుండా పోయింది. రెండోసారి అధికారం చేజిక్కించుకున్నాక వారి క్రూరత్వం మరింత పెరిగింది. తాము మారామని చెబుతున్నా చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మహిళలకు సంబంధించి రోజుకో ఫత్వా జారీ చేస్తూ.. ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నారు. క్రీడలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవంటూనే మహిళల పేర్లు చెప్పి రాక్షస పాలన అమలు చేస్తున్నారు. తాజాగా మహిళల అశ్లీలతను సాకుగా చూపి ప్రపంచ క్రికెట్‌ పండుగ అయిన ఐపీఎల్ ‌(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌)పై నిషేధం విధించారు తాలిబన్లు.

ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్ తాలిబన్‌(అఫ్ఘానిస్తాన్‌)లో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తున్నామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అఫ్ఘాన్‌లో ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ను గట్టిగా హెచ్చరించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి వారు చెప్పిన కారణం మరీ విడ్డూరంగా ఉంది. ఐపీఎల్ మ్యాచులు చూసేందుకు స్టేడియాలకు వస్తున్న మహిళా ప్రేక్షకులను టీవీలో చూపిస్తున్నారని, మ్యాచ్ ల సందర్భంగా యువతులు (చీర్ లీడర్లు) డ్యాన్స్ చేస్తారని… ఇది తమ ఆచారాలకు వ్యతిరేకం అని అందుకే ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ చేస్తున్నట్టు తాలిబన్లు వివరించారు.

Apple iPhone: భారీ తగ్గింపు ధరలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఐఫోన్‌లు

కాగా, అఫ్ఘానిస్తాన్‌ స్టార్‌ ఆటగాళ్లు రషీద్‌ఖాన్‌, నబీ సహా పలువురు క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. తాలిబన్ల తాజా నిర్ణయం పట్ల వీరు విచారం వ్యక్తం చేస్తున్నారు. షరియా చట్టం పేరుతో తాలిబన్ ప్రభుత్వం ఇప్పటికే అఫ్ఘాన్ లో మహిళలపై ఆంక్షలు విధించింది. క్రీడలు, వినోదానికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనూ మహిళలు పాల్గొనకూడదని ఇప్పటికే హుకుం జారీ చేసిం సంగతి తెలిసిందే. ఇప్పటికే తాలిబన్ల పాలనలో అనేక వినోద కార్యక్రమాలపై ఆంక్షలు అమల్లో ఉండగా, తాజాగా ఈ జాబితాలో ఐపీఎల్‌ కూడా చేరింది.

IT Recruitment : ఐటీలో 15,000 ఉద్యోగాలు

రెండో అప్ఘానిస్తాన్ ను చేజిక్కించుకున్నప్పటి నుంచి మహిళలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల గౌరవాన్ని కాపాడతామని తాలిబన్లు ప్రకటించినప్పటికీ… ఆ మేరకు వారు ఏ మాత్రం వ్యవహరించడం లేదు. అన్ని రకాల క్రీడలకు మహిళలను దూరం చేశారు. ఇంటికే పరిమితం కావాలని, పురుషుల తోడు లేకుండా ఇంటి గడప కూడా దాటరాదని హుకుం జారీ చేశారు.