IT Recruitment : ఐటీలో 15,000 ఉద్యోగాలు

ఐటీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. అంతేకాదు జీతాలు కూడా విపరీతంగా ఇస్తున్నాయి ఐటీ కంపెనీలు. భారత్ లో 15,000 మంది ఉద్యోగుల నియామకానికి ఆటోస్ సిద్ధమవుతోంది.

IT Recruitment : ఐటీలో 15,000 ఉద్యోగాలు

It Recruitment

IT Recruitment : ఐటీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. అంతేకాదు జీతాలు కూడా విపరీతంగా ఇస్తున్నాయి ఐటీ కంపెనీలు. ఇక వచ్చే ఏడాది భారత్ లో 15,000 మంది ఉద్యోగుల నియామకానికి ప్రాన్స్ టెక్ దిగ్గజం ఆటోస్ సన్నాహాలు చేస్తోంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ఈ నియామకం చేపడుతోంది కంపెనీ. ఇక ఈ కంపెనీకి ఇప్పటికే 40 వేలమంది ఉద్యోగులు ఉన్నారు. అదనంగా భారీ సంఖ్యలో నూతన నియామకాల వైపు మొగ్గుచూపుతున్నట్లు కంపెనీ సీఈఓ ఎలీ గిరార్డ్ తెలిపారు.

Read More : Charge Sheet: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్‌.. సెలబ్రిటీలకు క్లీన్ చిట్!

ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో డిజిటలీకరణ వేగంగా పుంజుకుంటుండటంతో నూతన ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత యువతలో నైపుణ్యంతోపాటు కష్టపడే తత్వం అధికంగా ఉన్నాయని.. అందుకే తాము భారత ఐటీ ఉద్యోగులపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. కొత్త టెక్నాలజీలు తోడు 5జీ సేవలు అందుబాటులోకి రావడంతో సేవారంగంలో ఉన్న సంస్థలకు విస్తృత అవకాశాలు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని చెప్పారు. ఒక‌ట్రెండు సంవ‌త్స‌రాల్లో సైబ‌ర్ సెక్యూరిటీ సేవ‌ల్లో ప్ర‌పంచంలోనే తాము నెంబ‌ర్‌వ‌న్ స్ధానానికి చేరుకుంటామ‌ని గిరార్డ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. కాగా సైబ‌ర్ సెక్యూరిటీ సేవ‌ల్లో యూర‌ప్‌లో అగ్ర‌స్ధానంలో, ప్ర‌పంచంలో రెండో స్ధానంలో ఉన్నామ‌ని అన్నారు.

Read More : Sexually Harassment : ఓ ముద్దివ్వు….రూ.25 వేలు ఇస్తా… డాక్టర్‌కు పేషెంట్ బంపర్ ఆఫర్