Taliban Promise: ఇదేనట గుడ్ న్యూస్.. కొంటె మహిళలను ఇళ్లలోనే ఉంచుతామంటోన్న తాలిబాన్లు

అఫ్ఘానిస్తాన్ అంతర్గత మంత్రి , తాలిబాన్ కో డిప్యూటీ లీడర్ సిరాజుద్దీన్ హఖ్కానీ హైస్కూల్స్ కు బాలికలను తిరిగి అనుమతిస్తామని చెప్పారు. త్వరలో గుడ్ న్యూస్ ఉంటుందని చెప్పిన ఆయన.. ఎవరైతే ఆందోళనలు చేస్తూ రోడ్లకెక్కారో వారు ఇళ్లల్లోనే ఉండాలని చెప్పారు.

Afghan New Law..taliban Orders Women To Wear Head To Toe Clothing In Public

Taliban Promise: అఫ్ఘానిస్తాన్ అంతర్గత మంత్రి , తాలిబాన్ కో డిప్యూటీ లీడర్ సిరాజుద్దీన్ హఖ్కానీ హైస్కూల్స్ కు బాలికలను తిరిగి అనుమతిస్తామని చెప్పారు. త్వరలో గుడ్ న్యూస్ ఉంటుందని చెప్పిన ఆయన.. ఎవరైతే ఆందోళనలు చేస్తూ రోడ్లకెక్కారో వారు ఇళ్లల్లోనే ఉండాలని చెప్పారు.

అఫ్ఘానిస్తాన్ మొత్తం తాలిబాన్ల కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత మహిళలకు స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పారు. కానీ, వాళ్లు చెప్పిన దానికి విరుద్ధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చి బాలికలను స్కూల్స్ కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రస్తుత తాలిబాన్ పాలనలో మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతుండగా.. ఈ సీనియర్ లీడర్ కొంటె మహిళలు ఇళ్లలోనే ఉంటారంటూ కామెంట్ చేశారు.

కొంటె స్త్రీలు అని చెప్తూ.. ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా చేసిన మహిళలను ప్రస్తావిస్తూ జోకింగ్ లా అలా చెప్పినట్లు వివరించారు. సిరాజుద్దీన్ హక్కానీపై FBI 10 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించింది. US స్టేట్ డిపార్ట్‌మెంట్ “ప్రత్యేకంగా గ్లోబల్ టెర్రరిస్ట్”గా అభివర్ణించింది.

Read Also: అఫ్ఘానిస్తాన్ నుంచి యుక్రెయిన్‌కు.. రష్యా దాడులతో మరో దేశానికి

“ఇప్పటికే బాలికలు 6వ తరగతి వరకు పాఠశాలకు వెళ్లేందుకు అనుమతించాం. ఆ గ్రేడ్ పైన వెళ్లేందుకు కూడా యథావిధిగా కొనసాగుతుంది. అతి త్వరలో, దేవుడు సంకల్పం ఉంటే, ఈ సమస్య గురించి మీరు గుడ్ న్యూస్ వింటారు. ” అని మీడియా ముందు వెల్లడించాడు.