Afghanistan PM : యూఎన్ ఉగ్రవాది..అఫ్ఘాన్ కాబోయే ప్రధానమంత్రి!

అఫ్ఘానిస్తాన్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు తాలిబ‌న్లు రంగం సిద్ధం చేస్తున్నారు.

Afghanistan PM అఫ్ఘానిస్తాన్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు తాలిబ‌న్లు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ దేశ ప్ర‌ధానిగా తాలిబన్ నేత ముల్లా మొహ‌మ్మ‌ద్ హ‌స‌న్ అఖుండ్ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కామున్నట్లు సమాచారం. అఖుండ్‌ను ప్ర‌ధాని చేసేందుకు తాలిబ‌న్లు చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. బయటి ప్రపంచానికి తక్కువగా తెలిసిన ఈ తాలిబన్ నేత ఐక్య‌రాజ్య‌స‌మితి ఉగ్ర‌వాద జాబితాలో ఉన్నాడు.

కాగా, ముల్లా మొహ‌మ్మ‌ద్ హ‌స‌న్ అఖుండ్…కాందహార్ ప్రాంతానికి చెందినవాడు. తాలిబ‌న్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుల్లో ఆయ‌న ఒక‌రు. తాలిబ‌న్ ఆధ్మాత్మిక నేత షేక్ హిబాతుల్లా అఖుండ్జాకు కూడా అఖుండ్ చాలా స‌న్నిహితుడు.

20 ఏళ్ల పాటు తాలిబ‌న్ల లీడ‌ర్‌ షిప్ కౌన్సిల్ “రెహ‌బారీ షురా”కు అఖుండ్ నాయ‌క‌త్వం వ‌హించాడు. గత తాలిబన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించాడు. మిలిట‌రీ నేత‌లా కాకుండా.. ఎక్కువ శాతం మ‌త‌ప‌ర‌మైన ఆదేశాలు ఇస్తుంటాడు.

READ Mullah Baradar : అప్ఘాన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న ముల్లా బరాదర్ ఎవరో తెలుసా!

READ Taliban : అసలు ఎవరీ తాలిబన్లు..వీళ్ల లక్ష్యం ఏంటీ!

READ Taliban : అప్ఘానిస్తాన్ లో తాలిబన్ పాలన స్టార్ట్..పెత్తనమంతా ఆ నలుగురిదే!

ట్రెండింగ్ వార్తలు