Pakistan Taliban Militants : పాకిస్తాన్ లో పోలీస్ స్టేషన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ మిలిటెంట్లు

పాకిస్తాన్ లో తాలిబన్ మిలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. ఓ పోలీస్ స్టేషన్ ను మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న మోస్ వాంటెడ్ టెర్రరిస్టులను విడిపించారు.

Pakistan Taliban Militants : పాకిస్తాన్ లో పోలీస్ స్టేషన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ మిలిటెంట్లు

Taliban militants

Updated On : December 19, 2022 / 11:51 AM IST

Pakistan Taliban Militants : పాకిస్తాన్ లో తాలిబన్ మిలిటెంట్లు దాడులకు తెగబడ్డారు. ఓ పోలీస్ స్టేషన్ ను మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలో ఉన్న ఖైబర్ షఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ బన్ను కంటోన్మెంట్ లోని పోలీస్ స్టేషన్ పై తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) ఫైటర్లు దాడి చేసి, స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్తాన్ పోలీసులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న మోస్ వాంటెడ్ టెర్రరిస్టులను విడిపించారు.

Afghanistan: 210 మందికి పైగా ఖైదీలను విడుదల చేసిన తాలిబాన్లు.. ఆందోళనలో ఆఫ్ఘాన్లు

ఆ తర్వాత తీవ్రవాద నిరోధక శాఖకు చెందిన భద్రతా సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారని వెల్లడించారు. అయితే తీవ్రవాదులు బయటి నుంచి వచ్చి దాడి చేశారా? లేదా లోపల ఖదీలుగా ఉన్నవారే పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కుని దాడి చేశారా అన్నది తెలియడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని తెలిపారు.