Taliban : కళ్ల ముందు తుపాకులు..డోంట్ కేర్ అంటున్న అప్ఘాన్ మహిళలు

గుండెలకు సూటిగా తుపాకీని గురిపెట్టాడు. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితేచాలు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అయినా ఆ మహిళలో మాత్రం బెరుకులేదు, బెదురులేదు.

Gun Taliban

Afghanistan Women : అఫ్ఘానిస్తాన్‌ మహిళలు ప్రాణాలకు ఎదురొడ్డుతున్నారు. అణచివేతకు గురవడమే కాదు… అవసరమైతే గొంతెత్తడమూ తెలుసని నిరూపిస్తున్నారు. తమ దేశంలో పరాయ వ్యక్తుల పన్నాగాలను సహించలేక సమరానికి సై అంటున్నారు. కళ్లముందే తుపాకులతో తాలిబన్ రాక్షసులు నిల్చున్నా… డోంట్ కేర్ అంటూ ముందుకు కదులుతున్నారు. మునుపెన్నడూ లేనంత ధైర్యాన్ని చూపిస్తూ రాక్షసుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఈ ఒక్క ఫొటో చాలు.. అఫ్ఘాన్‌ మహిళల ధీరత్వాన్ని చాటడానికి. అడుగు దూరంలో మృత్యువు తాలిబన్ల రూపంలో నిల్చుంది.

Read More : Afghan crisis : తాలిబన్ టెర్రర్..అజ్ఞాతంలోకి అఫ్ఘానిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు..

గుండెలకు సూటిగా :-
గుండెలకు సూటిగా తుపాకీని గురిపెట్టాడు. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితేచాలు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అయినా ఆ మహిళలో మాత్రం బెరుకులేదు, బెదురులేదు. చావుకు సైతం భయపడేది లేదంటూ తల ఎత్తుకుని నిల్చుంది. దమ్ముంటే కాల్చాలన్నట్లుగా కళ్లలోకి కళ్లుపెట్టి చూస్తోంది. ఇన్నాళ్లు చూసిన, విన్న బాంబుల శబ్దాలకంటే ఒక్క తుపాకీ తూటా ఎక్కువేమీ కాదన్నట్లు నిలబడింది. ఇది ఈ ఒక్క మహిళకే పరిమితం కాలేదు.

Read More : China : తాలిబన్లతో ఒప్పందం కోసం చైనా ప్రయత్నం – బైడెన్

మహిళలు అపరకాళీ అవతారం :-

ప్రస్తుతం కాబూల్‌లో ఏ మహిళతో మాట్లాడినా ఇదే ధైర్యాన్ని చూపిస్తున్నారు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పాలన పట్టాలకెక్కముందే ప్రతిఘటన మొదలైంది. ముఖ్యంగా మహిళలు అపరకాళీ అవతారం ఎత్తుతున్నారు. లతో హోరెత్తిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీసిన మహిళలే… ఇపుడు ప్రాణాలకు తెగించి పోరుబాట పడుతున్నారు. ప్రస్తుతం అక్కడి ప్రజలందరూ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కొందరు మహిళలు మాత్రం తమ దేశం కోసం నడుం బిగించారు. తమకు వ్యతిరేకంగా గొంతెత్తితే చాలు గొంతు నులిమేస్తున్న తాలిబన్ల రాజ్యంలో… ధైర్యంగా బహిరంగ నిరసన చేపట్టారు.

Read More : Afghanistan : అఫ్ఘాన్‌ పరిణామాలపై భారత్‌తో రష్యా, అమెరికా చర్చలు

పాక్ కు వ్యతిరేకంగా :-
తాలిబన్ల నిరంకుశ వైఖరితో విసిగిపోతున్న అఫ్ఘాన్‌ మహిళలు తమ నిరసనలను తెలియజేసేందుకు రోడ్డెక్కారు. అనూహ్యంగా కాబూల్‌ నగరంలో భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన నినాదాలు చేశారు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పెత్తనం మొదలయ్యాక జనం ఈ స్థాయిలో వీధుల్లోకి రావడం ఇదే మొదటిసారి. తాలిబన్లకు పాకిస్తాన్‌ సహకరిస్తోందని, తమదేశ వ్యవహారాల్లో పాక్ జోక్యం తగదని భారీ ఎత్తున నిరసనకు దిగారు మహిళలు.

 

పాక్ ఎంబసీ ఎదురుగా :-
కాబూల్‌లోని పాకిస్తాన్‌ ఎంబసీ ఎదురుగా ఆందోళన చేపట్టారు. పాక్‌ వ్యతిరేక నినాదాలతో ఎంబసీ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఇన్ని సంవత్సరాలుగా తాము సాధించిన విజయాలు, దక్కించుకున్న కనీస హక్కులు వృథాగా పోకూడదంటూ నినదించారు. తమ దేశంలో పాక్ జోక్యం, పెత్తనం ఏంటని ప్రశ్నించారు. పాక్ గో బ్యాక్, పాకిస్తాన్‌కు మరణశాసనం తప్పదు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే కాబూల్ లో ఆజాది నినాదాలు ప్రతిధ్వనించడాన్ని జీర్ణించుకోలేక పోయిన తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ మహిళలు వెనక్కి తగ్గలేదు.  బెదిరిపోకుండా నినాదాలను కొనసాగించారు. దీంతో తాలిబన్లు నిరసనకారులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆ మహిళలు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అటు.. హెరాత్‌లోను ఇవే సీన్లు కనిపించాయి. అక్కడ కూడా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.