China : తాలిబన్లతో ఒప్పందం కోసం చైనా ప్రయత్నం – బైడెన్

తాలిబన్లతో చైనా ఒప్పందం చేస్తోందా ? అంటే ఎస్ అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్. ఒప్పందం కోసం చైనా ప్రయత్నిస్తోందని తాను నమ్మకంగా చెప్పగలనని..అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేస్తున్నారు.

China : తాలిబన్లతో ఒప్పందం కోసం చైనా ప్రయత్నం – బైడెన్

America

Updated On : September 8, 2021 / 12:22 PM IST

China – Taliban : తాలిబన్లతో ..చైనా ఒప్పందం చేస్తోందా ? అంటే ఎస్ అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్. ఒప్పందం కోసం చైనా ప్రయత్నిస్తోందని తాను నమ్మకంగా చెప్పగలనని..అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేస్తున్నారు. చైనాకు అసలైన సమస్యలు తాలిబన్లతో వస్తాయని, అందుకోసమే…తాలిబన్లతో ఒప్పందం కోసం ప్రయత్నిస్తారని తెలిపారు. చైనాతో పాటు…పాక్, రష్యా, ఇరాన్ దేశాలు ఇలాగే చేస్తాయని నమ్ముతున్నట్లు…అయితే..ఈ విషయంలో వారందరూ ఇప్పుడేం చేయగలరో అదే చేస్తారని అన్నారు బైడెన్.

Read More : Afghanistan : ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు కసరత్తు, పలు దేశాలకు ఆహ్వానం

అమెరికా నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో ఉన్న తాలిబన్లకు చైనా నుంచి నిధులు వెళుతున్నాయా ? దీనిపై అమెరికా ఆందోళనగా ఉందా ? అని విలేకర్లు ప్రశ్నించగా..బైడెన్ పై విధంగా సమాధానం చెప్పారు. అప్ఘాన్ దేశాన్ని తాలిబను ఆక్రమించిన అనంతరం అమెరికా చేసిన చర్యలను ఆయన వివరించారు. అప్ఘాన్ విదేశీ మారకద్రవ్య రిజర్వును తాలిబన్లు వినియోగించుకోకుండా…అమెరికా బ్లాక్ చేసిందని చెప్పారు. అమెరికా..ఏడు మిత్రదేశాలు సమన్వయంగా వ్యవహరించే విషయంలో..ఓ అంగీకారానికి వచ్చాయన్నారు.

Read More : US : అప్ఘాన్‌‌ను ఖాళీ చేసిన అమెరికా, సంబరాలు చేసుకున్న తాలిబన్లు

చైనా, రష్యా, వంటి దేశాలు తాలిబన్లతో ఒప్పందం చేసుకుంటే…మాత్రం…అమెరికాలో రిజర్వు నిధి కోసం పెద్దగా వెంపర్లాడరని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో…మిగిలిన దేశాలను కూడా సమన్వయం చేసుకోవడానికి వీలుగా ఇటలీ నేతృత్వంలో వర్చువల్ గా జీ 20 సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు మాత్రం డేట్స్ ఫిక్స్ చేయలేదు. ప్రపంచ దేశాలు తాలిబన్లతో చర్చించి…మార్గదర్శకత్వం చేయాలంటూ.. అమెరికా విదేశాంగ మంత్రి అంటోనికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేశారు. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.