Afghan : తాలిబన్ల పైశాచికత్వం, జర్నలిస్టు ముక్కును నేలకు రాయించారు..మహిళలపై దాడులు

తాలిబన్ల పైశాచికత్వం పెరిగిపోతోంది. దారుణాలకు తెగబడుతున్నారు. ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

Afghan : తాలిబన్ల పైశాచికత్వం, జర్నలిస్టు ముక్కును నేలకు రాయించారు..మహిళలపై దాడులు

Taliban

Afghan Journalists : తాలిబన్ల పైశాచికత్వం పెరిగిపోతోంది. దారుణాలకు తెగబడుతున్నారు. ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశ్నించే వారిని, నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్న వారిని భయబ్రాంతులకు గుర చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న మహిళలను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. అక్కడ జరుగుతున్న ఆందోళనలు ప్రపంచానికి తెలియచేసేందుకు ప్రయత్నిస్తున్న జర్నలిస్టులు, మీడియా వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.

Read More : Ola : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్…బుక్ చేసుకోండి..రూ.2,999 ఈఎంఐ

మహిళల నిరసన వార్తను కవర్ చేస్తున క్రమంలో..తనపట్ల దారుణంగా ప్రవర్తించారని ఓ జర్నలిస్టు వాపోయారు. కొన్ని గంటల తర్వాత విడుదల చేశారని, వారి అదుపులో ఉన్నప్పుడు అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వార్తను కవర్ చేసినందుకు నేలకు ముక్కు రాయాలని…ఆదేశించారని, దీంతో తాను ప్రాణభయంతో ఆ పని చేయడం జరిగిందన్నారు. తన ఐడీ కార్డు, కెమెరా ధ్వంసం చేశారని మరో జర్నలిస్టు వెల్లడించారు.

Read More : kistareddypet : సర్పంచ్ కృష్ణ సస్పెన్షన్, పాలకవర్గాన్ని రద్దు చేయాలంటూ ప్రతిపాదన

తాలిబన్ల అదుపులో ప్రముఖ ‘టోలో న్యూస్ కెమెరామెన్’ వాహిద్ అహ్మది ఉన్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. ఛానెల్ అధిపతి విన్నపంతో మూడు గంటల తర్వాత..విడిచిపెట్టారని పేర్కొంది. కెమెరామెన్ తో సహా…మరో 12 మందిని విడిచిపెట్టారని నజాఫిజాదా…ట్విట్టర్ వేదికగా తెలిపారు. మరోవైపు..ర్యాలీ వార్తలను కవర్ చేస్తున్న తమ జర్నలిస్టులను అరెస్టు చేశారని…స్థానిక ప్రధాన అరియాన న్యూస్ సంస్థ తెలిపింది. జర్నలిస్టు హయత్ బైసీతో పాటు..అతడి సహచరుడు సమీ జహేష్, కెమెరామెన్ సమిమ్ లను తాలిబన్లు అరెస్టు చేసినట్లు సంస్థ తెలిపింది.