SangaReddy : సర్పంచ్ కృష్ణ సస్పెన్షన్.. పాలకవర్గాన్ని రద్దు చేయాలంటూ ప్రతిపాదన

సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డి పేటలో.. పంచాయతీ పాలకవర్గం అవినీతి సొమ్ము వాటాల పంపకం.. ఆ పాలకవర్గం కొంప ముంచింది.

SangaReddy : సర్పంచ్ కృష్ణ సస్పెన్షన్.. పాలకవర్గాన్ని రద్దు చేయాలంటూ ప్రతిపాదన

Sarpanch

Kistareddypet Sarpanch : సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డి పేటలో.. పంచాయతీ పాలకవర్గం అవినీతి సొమ్ము వాటాల పంపకం.. ఆ పాలకవర్గం కొంప ముంచింది. సర్పంచ్‌ ఏరుల కృష్ణపై సస్పెన్షన్‌ వేటు పడింది. కృష్ణను సర్పంచ్‌ పదవి నుంచి శాశ్వతంగా తొలగిస్తూ.. జిల్లా పంచాయితీ రాజ్‌ శాఖ అధికారి సురేష్‌ మోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శికి టర్మినేషన్‌ నోటీసులు జారీ చేసి వేరే ప్రాంతానికి ట్రాన్స్ ఫర్‌ చేశారు. పంచాయతీ పాలకవర్గాన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు.

Read More : Shikhar Dhawan : విడిపోయిన శిఖర్ ధావన్ దంపతులు

హైదరబాద్‌ నగర విస్తరణలో భాగంగా అమీన్‌పూర్‌ మండలంలోని భూములకు మంచి డిమాండ్‌ పెరిగిందనే సంగతి తెలిసిందే. అక్కడ కిష్టారెడ్డిపేట ఉంది. దీనికి సర్పంచ్ గా కృష్ణ ఉన్నారు. భూముల ధరలు పెరుగుతుండడంతో దీనిని క్యాష్ చేసుకోవాలని అనుకున్నాడు. పాలకవర్గంతో కలిసి అనుమతుల పేరుతో అందినకాడికి జేబులు నింపుకున్నాడు.

Read More : Covid-19 థర్డ్ వేవ్ ఇంటి డోర్ దాకా వచ్చేసింది..! మేయర్ హాట్ కామెంట్స్

అన్యాయంగా సంపాదించిన మొత్తాన్ని చాలా పద్ధతిగా పంచాయతీ కార్యాలయంలోనే సరిసమానంగా పాలక వర్గానికి వాటాలు పంచాడు. ఈ దృశ్యాలన్నీ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ పుటేజ్‌ కాస్తా బయటికి రావడంతో.. విషయం ఉన్నతాధికారులకు చేరింది. దీనిపై పూర్తి విచారణ జరిపిన జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు.. సర్పంచ్‌పై చర్యలు తీసుకున్నారు.