Covid-19 థర్డ్ వేవ్ ఇంటి డోర్ దాకా వచ్చేసింది..! మేయర్ హాట్ కామెంట్స్

కరోనా థర్డ్ వేవ్ రాబోతోంది అనేది కరెక్ట్ కాదన్నారు ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్. అది ఆల్రెడీ ముంబైలో ఉందన్నారు.

Covid-19 థర్డ్ వేవ్ ఇంటి డోర్ దాకా వచ్చేసింది..! మేయర్ హాట్ కామెంట్స్

Mumbai Mayor

Covid-19 Third Wave: కరోనా మూడో ముప్పు పొంచి ఉందని ఎప్పటినుంచో నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనం జాగ్రత్తగా ఉండకపోతే… థర్డ్ వేవ్ తప్పనిసరిగా వస్తుందని చెబుతూ వస్తున్నారు. మాస్కులు మస్ట్ గా పాటించాల్సిందే అంటున్నారు. పండుగల వేళ గుమికూడొద్దని హెచ్చరిస్తున్నారు. ఐతే… మూడో వేవ్ వస్తోంది అనేది అబద్ధమంటున్నారు ముంబై మేయర్. అది ఆల్రెడీ వచ్చేసి.. ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉందని చెప్పడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.

Mumbai

Mumbai

ముంబైలో సెప్టెంబర్ నెల ఆరంభం నుంచే భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత ఆగస్ట్ లో నమోదైన మొత్తం కేసుల్లో 30శాతం కేసులు.. ఆల్రెడీ ఈనెల మొదటి ఆరు రోజుల్లోనే రికార్డయ్యాయి. కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న కేసుల తీవ్రతపై ముంబై మేయర్ స్పందించారు.

Sarvadarshanam : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్-సర్వదర్శనం టోకెన్లు జారీ

కరోనా థర్డ్ వేవ్ రాబోతోంది అనేది కరెక్ట్ కాదన్నారు ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్. అది ఆల్రెడీ ముంబైలో ఉందన్నారు. ఇంటి డోర్ దగ్గర దాకా వచ్చేసిందన్నారు. కరోనా కేసులు మళ్లీ మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైలో పెరుగుతున్నాయన్నారు. గణేశ్ చతుర్థిని జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోకపోతే… కరోనా కేసులను కంట్రోల్ చేయలేని స్థితికి వెళ్లొచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు.