Shikhar Dhawan : విడిపోయిన శిఖర్ ధావన్ దంపతులు
భారత క్రికెటర్ శిఖర్ ధావన్, అయేషా దంపతులు విడిపోయారు. ఈ విషయాన్నీ శిఖర్ భార్య ఆయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిర్ధారించింది.

Shikhar Dhawan
Shikhar Dhawan : భారత క్రికెటర్ శిఖర్ ధావన్, అయేషా దంపతులు విడిపోయారు. ఈ విషయాన్నీ శిఖర్ భార్య ఆయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిర్ధారించింది. కాగా వీరిద్దరికి 2012లో వివాహం అయింది. వీరికి జొరావర్ అనే 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన ఆయేషాకు శిఖర్‌తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమెకు మొదటి భర్తతో ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చింది. వారిద్దరిని తన పిల్లలుగానే ప్రకటించిన ధావన్ బాధ్యతను కూడా తీసుకొని మెల్‌బోర్న్‌లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు.
వ్యక్తిగతంగా, తన కెరీర్ ఎదుగుదలలో ఆయేషా పాత్ర ఎంతో ఉందంటూ చాలా సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన ధావన్ తమ అన్యోన్యతను ప్రదర్శిస్తూ వచ్చాడు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు పెరిగిపోయినట్లు తెలుస్తోంది. జీవితంలో రెండోసారి తాను విడాకులు తీసుకోవాల్సి రావడంపై ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయేషా తన ఆవేదనను వ్యక్తం చేసింది.
View this post on Instagram