భార్య విడాకులిచ్చిందనే బాధతో ఓ భర్త నెలరోజులు అదేపని.. కొడుకు చొరవతో ఆస్పత్రిలో చేర్చేందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థ.. కానీ..
థాయిలాండ్‌లోని బాన్‌చాంగ్ జిల్లాకు చెందిన 44ఏళ్ల థవీసక్ అనేవ్యక్తి భార్య విడాకులు ఇచ్చిన తరువాత మానసికంగా కుంగిపోయాడు.

Thai man died after drinking only beer for a month following his divorce
Thailand: భర్తను, పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోతున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి తరహా ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా అనేకం చోటు చేసుకుంటున్నాయి. అయితే, థాయిలాండ్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భర్త నచ్చలేదని ఓ భార్య 16ఏళ్ల కొడుకును అతని వద్దనే వదిలేసి భర్తకు విడాకులిచ్చింది. భార్య చేసిన పనికి తట్టుకోలేక పోయిన భర్త.. నెలరోజులు తిండిమానేసి ఒకటే పనిచేస్తుండిపోయాడు. కొడుకు పాఠశాల నుంచి వచ్చి వండిపెట్టినా తినడం మానేశాడు. దీంతో ఆరోగ్యం క్షీణించి మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
థాయిలాండ్‌లోని బాన్‌చాంగ్ జిల్లాకు చెందిన 44ఏళ్ల థవీసక్ అనేవ్యక్తి భార్య విడాకులు ఇచ్చిన తరువాత మానసికంగా కుంగిపోయాడు. వారిద్దరికి 16ఏళ్ల కొడుకు ఉన్నాడు. కొడుకును థవీసక్ వద్దనే వదిలేసింది. అప్పటి నుంచి అతను నెలరోజుల పాటు తిండిమానేసి కేవలం బీర్లు మాత్రమే తాగుతూ ఉండిపోయాడు. దీంతో అతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. అతని కుమారుడు పాఠశాల విద్యను అభ్యసిస్తున్నాడు. ప్రతీరోజూ పాఠశాల నుంచి ఇంటికొచ్చి తండ్రికోసం ఆహారం సిద్ధం చేసి అందించినా థవీసక్ తినేవాడు కాదు. నెలరోజులపాటు ఇదే తంతు కొనసాగింది.
ఓరోజు థవీసక్ అనారోగ్యంతో గదిలో స్పృతప్పి పడిపోయాడు. కొడుకు ఓ స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇచ్చాడు. సహాయం చేయాలని కోరాడు. దీంతో థవీసక్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు స్వచ్ఛంద సంస్థ సిద్ధమైంది. ఈ క్రమంలో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సంస్థ సిబ్బంది ఇంటికి రాగా.. ఇంట్లో బెడ్ రూంలో అతను చనిపోయి కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటన స్థలికి చేరుకొని చూడగా అతని గది నిండా బీరు సీసాలే ఉన్నాయి. దీంతో పోలీసులు కుమారుడ్ని ప్రశ్నించగా.. నెల రోజులుగా ఆహారం తీసుకోవటం లేదు.. కేవలం బీర్లు తాగుతూ జీవిస్తున్నాడని చెప్పాడు.