Thailand fisherman rock like lumps on beach..it turns out to be whale vomit : చేపలు పట్టుకుని జీవించే ఓ జాలరికి ఓ ‘వాంతి’తో అదేనండీ..తిన్నది అరక్కపోయినా..కడుపు అప్ సెట్ అయినా వస్తాయే ఆ వాంతులు. ఆ ‘‘వాంతి’’తో ఓ జాలరి అదృష్టం వరించి కోటీశ్వరుడైపోయాడు. అందేంటి ‘వాంతి’ చేసుకుంటే అనారోగ్యం వస్తుంది కానీ అదృష్టం వస్తుందా? అసలు వాంతి ఏంటీ కోటీశ్వరుడేంటీ? ఇదోదో మరీ వెటకారం వార్తలాగుండే అనుకుంటున్నారా? కానే కాదు ఇది నిజం. ఓ ‘వాంతి’ చేపలు పట్టుకునే జాలరిని కోటీశ్వరుడ్ని చేసింది.
థాయ్‌ల్యాండ్‌కు చెందిన నరీస్ సువన్నశాంగ్ అనే 60 ఏళ్ల జాలరి. నాఖోన్ సి దమ్మరాట్ సముద్ర తీరంలో నడుస్తుండగా గట్టిగా ఉండే రాయిలాంటివి దొరికాయి. అవి ఏదో వింతగా అనిపించటంతో వాటిని ఇంటికి పట్టుకొచ్చిన తన సోదరులను పిలిచి వాటిని ఇంట్లో పెట్టమన్నాడు. వాటిని చూసిన నరీస్ సోదరులు…ఆ రాళ్లు సాధారణమైనవి కాదని అసలు అవిరాళ్లే కావనీ..అవి ‘‘వేల్ వోమిట్స్’’ (తిమింగలం వాంతి) అని చెప్పారు. దాన్ని ‘అంబర్గ్రిస్’ అని అంటారని బహుశా ఇవి అవే అయి ఉండవని అనుకున్నారు.
కానీ వాటిని చూస్తే సాధారణ రాళ్లలా లేవని నరీన్ సోదరులు ఆ రాళ్లకు లైటర్‌తో నిప్పు అంటించారు. ఆ నిప్పు అంటున్నాక అది ఓ రకమైన వాసన వచ్చింది. దీంతో వారి అనుమానం మరింత బలపడింది. అది అంబర్గ్రిస్ అయి ఉండవచ్చని అనుకున్నారు.
దీంతో ఓ వ్యాపారవేత్తకు ఈ విషయాన్ని చెప్పగా..నరీస్ ఇంటికి వచ్చిన ఆ వ్యాపారి దాన్ని పరీక్షించింది.. అంబర్గ్రిస్ అని తేల్చి చెప్పాడు. ఆ తరువాత ఆ అంబర్గ్రిస్ కు కళ్లు చెదిరే మొత్తాన్ని ఆఫర్ చేశాడు. ఆ ఎమౌంట్ విన్న నరీస్ కుటుంబికులకు కళ్లు బైర్లు కమ్మాయి. అలా చిన్నా పెద్దా అంబర్గ్రిస్’కు 3.2 మిలియన్ డాలర్లు (రూ.23.5 కోట్లు) ఇస్తానని చెప్పాడు. దీంతో నరీస్ ఆశ్చర్యపోయాడు. తన అదృష్టం బాగుండి వాటిని ఇంటికి తేవటంతో తన దశ తిరిగిపోయిందని ఆనందపడ్డాడు. మొత్తానికి ఆ జాలరిని అదృష్టం ‘‘తిమింగిలం వాంతి’’తో దశ తిరిగింది.
‘అంబర్గ్రిస్’కు అంత డిమాండ్ ఎందుకంటే..
‘అంబర్గ్రిస్’ అనే రాయిలాంటిది స్మెర్మ్ వేల్స్ నుంచి పుడుతుంది. పొడవైన ముక్కుతో ఉండే ఈ తిమింగిలాలు స్పెర్మ్ ఆయిల్‌ను విడుదల చేస్తాయి. దాన్నే ‘అంబర్గ్రిస్’ అని అంటారు. తిమింగలం దాన్ని నీటిలోకి వాంతి చేస్తుంది. అది అలా అలా సముద్ర తీరానికి కొట్టుకొస్తుంది. ఈ ‘అంబర్గ్రిస్’ లను నీటిపై తేలియాడే బంగారం అని కూడా అంటారు. ‘అంబర్గ్రిస్’ను ఎక్కువగా ఖరీదైన పెర్‌ఫ్యూమ్‌లలో ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించడం వల్ల పెర్ఫ్యూమ్ ఎక్కువ సేపు వాసన కోల్పోకుండా ఉంటుందట.