Earths Lighting : కాంతి కోల్పోయి మసకబారిపోతున్న భూమి..ఆందోళన వ్యక్తంచేస్తున్న శాస్త్రవేత్తలు
నీలి రంగులో మెరిసిపోయే భూమి కళ తప్పిపోతోంది. కాంతిని కోల్పోయిన మసకబారిపోతోందని ఓ పరిశోధనలో తేలింది. ఈ పరిస్థితిపై పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

The Climate Crisis Is Dimming Earths Light Says A Study
Dimming Earths Light : కాలుష్యం.. కాలుష్యం.. ఎక్కడ చూసినా కాలుష్యమే. యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అభివృద్ధి పేరుతో పెరుగుతున్న ఈ కాలుష్య భూతానికి మనషికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో జరగుతున్న పెను మార్పులు పర్యావరణాన్ని కాటేస్తున్నాయి. ఈ కాలుష్యాన్ని సాధారణంగా తీసుకోవటానికి వీల్లేదని పరిశోధకులు పదే పదే హెచ్చరిస్తున్నారు. మనిషి ప్రాణానికే ముప్పుగా పరిణమించే ఈ కాలుష్యం అక్కడితో ఆగటంలేదు. ఈ కాలుష్యం ఎంతగా మారిందంటే ఏకంగా భూగోళం కాంతి తగ్గిపోయి మసకబారేలా చేస్తేంత. భూమి మసకబారిపోతోందని శాస్త్రవేత్తలో అధ్యయనంలో వెల్లడికావటంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read more : El Salvador Cryptocurrency : చిన్నదేశం..గొప్ప ఆలోచన..అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్ తయారీ ఘనత
అంతరిక్షంలోంచి చూస్తే నీలిరంగులో మెరిసిపోతూ భూమి ఎంతో అందంగా కనిపిస్తుందట. అటువంటి భూమి మసకబారిపోతోంది పరిశోధకులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ మార్పులు క్రమేపీ జరుగుతున్న ఈ పరిస్థితి మాత్రం తీవ్రమైంది. ఎంత తీవ్రమైందీ అంటే గత 20ఏళ్లలోనే భూమి రోజు రోజుకు మసకబారిపోయేంతగా. న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఒక చదరపు మీటరుకు సగం వాట్ తక్కువ కాంతిని భూమి ప్రతిబింబిస్తోందని..దీన్ని బట్టి గత 20 ఏళ్లలో దాదాపు 0.5 శాతం కాంతి తగ్గిపోయిందని అధ్యయనంలో వెల్లడైంది.
ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రముఖ శాస్త్రవేత్త ఫిలిప్ మాట్లాడుతు..గత రెండు దశాబ్దాలలో 17 ఏళ్లపాటు భూమి కాంతిలో ఎటువంటి మార్పు లేదని..కానీ గత మూడేళ్లలోనే భూమి కాంతిలో పెను మార్పులు సంభవించాయని వెల్లడించారు. గత మూడేళ్ల డేటాను పరిశీలించినప్పుడు ఈ ఆందోళనకర విషయాలు బయటపడ్డాయని ఫిలిప్ తెలిపారు.
Read more : Machu Picchu : మాచు పిచ్చుకు కార్బన్ న్యూట్రల్ సర్టిఫికెట్..అసలేంటీ సర్టిఫికెట్?ఎందుకిచ్చారు?
కాగా..భూమిపై సూర్యకాంతి వెలుగును ప్రభావితం చేయటంలో మాత్రం ఎటువంటి మార్పులు లేవు కానీ..భూమి మసకబారిపోతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. దీనికి కారణం భూమిపై జరుగుుతున్న పరిస్థితులు, సముద్రాలు వేడెక్కడమే కారణమని శాస్త్రవేత్తలు వివరించారు.