Most Expensive Pillow : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు

దిండు తయారీ విధానాన్ని వీడియో రూపంలో షేర్ చేశారు. ఈజిప్టు పత్తి, మల్బరీ సిల్క్ తో ఈ అధునాతన దిండును రూపొందించారు. ఇది విషరహిత ఫోమ్ తో నిండి ఉంటుంది. దిండు పైభాగంలో 22.5 క్యారెట్ల నీలమణి, నాలుగు వజ్రాలను అమర్చారు.

Most Expensive Pillow : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు

Expensive Pillow

Updated On : June 27, 2022 / 12:31 PM IST

most expensive pillow : సుఖవంతమైన, ప్రశాంతంగా నిద్ర పోవడానికి దిండు వినియోగిస్తుంటాం. అయితే దిండు ధర నాణ్యత, పరిమాణాన్ని బట్టి వందలు, వేలలో ఉంటుంది. కానీ ఓ దిండు ధర లక్షల్లో ఉంది. నెదర్లాండ్ నిపుణుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండును తయారు చేశాడు. అయితే దిండు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నెదర్లాండ్ కు చెందిన నిపుణుడు ప్రత్యేకమైన దిండును తయారు చేశారు.

ఈ అనుధానతన దిండు తయారీలో నీలమణి, వజ్రాలు, బంగారం, మల్బరీ సిల్క్ తోపాటు పలు విలువైన వస్తువులను వినియోగించినట్లు రూపకర్త థిజ్ వాన్ డెర్ హిల్ట్స్ తెలిపారు. ఈ ప్రత్యేకమైన దిండు తయారీకి ఏకంగా 15 ఏళ్లు శ్రమించినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు ఇదేనని. ఈ దిండు ప్రారంభ ధర 57 వేల డాలర్లు.. అంటే దాదాపు రూ.45 లక్షలుగా నిర్ణయించారు. ఈ దిండుకు సబంధించిన విశేషాలు, వివరాలను tailormadepillow.comలో పొందుపరిచారు.

1955 Mercedes-Benz..300 SLR : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు..ధర రూ.1100 కోట్లు..!!

దిండు తయారీ విధానాన్ని వీడియో రూపంలో షేర్ చేశారు. ఈజిప్టు పత్తి, మల్బరీ సిల్క్ తో ఈ అధునాతన దిండును రూపొందించారు. ఇది విషరహిత ఫోమ్ తో నిండి ఉంటుంది. దిండు పైభాగంలో 22.5 క్యారెట్ల నీలమణి, నాలుగు వజ్రాలను అమర్చారు. సురక్షిత, ఆరోగ్యకరమైన నిద్ర కోసం.. విద్యుదయస్కాంత వికిరిణాలను నిరోధించేలా దిండుపై 24 క్యారెట్ల బంగారంతో తాపడం చేయించారు.

నిద్రలేమితో బాధపడుతున్న వారు ప్రశాంతంగా నిద్రపోవడానికి ఈ దిండు ఎంతగానో సహాయపడుతుందని రూపకర్త పేర్కొన్నారు. హైటెక్ సొల్యూషన్స్, పాతకాలపు హస్తకళ మేళవింపు ద్వారా టైలర్ మేడ్ పిల్లో అత్యంత వినూత్నమైంది. ఇది అన్నింటికంటే ప్రత్యేకమైనది..అని వెబ్ సైట్ లో పేర్కొన్నారు.