Lascar Volcano Erupted : చిలీలో బద్దలైన లాస్కర్ అగ్నిపర్వతం.. భారీగా పొగ, ధూళి, విష వాయువులు

చిలీలోని ఆండిస్ పర్వతాల్లో ఉన్న లాస్కర్ అగ్నిపర్వతం బద్దలైంది. భారీగా పొగ, ధూళి, విష వాయువులు వెదజల్లుతోంది. దీంతో ఆకాశంలో 6 వేల మీటర్ల ఎత్తు వరకు దట్టమైన పొగ కమ్ముకుంది.

Lascar Volcano Erupted : చిలీలో బద్దలైన లాస్కర్ అగ్నిపర్వతం.. భారీగా పొగ, ధూళి, విష వాయువులు

Lascar volcano

Updated On : December 11, 2022 / 11:44 AM IST

Lascar Volcano Erupted : చిలీలోని ఆండిస్ పర్వతాల్లో ఉన్న లాస్కర్ అగ్నిపర్వతం బద్దలైంది. భారీగా పొగ, ధూళి, విష వాయువులు వెదజల్లుతోంది. దీంతో ఆకాశంలో 6 వేల మీటర్ల ఎత్తు వరకు దట్టమైన పొగ కమ్ముకుంది. శనివారం(డిసెంబర్ 10,2022) మధ్యాహ్నం 12.36 గంటలకు విస్పోటనం చెందిందని నేషనల్ జియాలజి అండ్ మైనింగ్ సర్వీస్ పేర్కొంది.

అగ్నిపర్వతం బద్దలైనప్పుడు స్వల్పంగా భూమి కంపించిందని తెలిపింది. అగ్నిపర్వతానికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న తల్ర్బే పట్టణంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అండిస్ పర్వత శ్రేణుల్లో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాల్లో లాస్కర్ ఒకటి.

Volcano Erupted: ఇండోనేషియాలో బద్దలైన ఎత్తైన అగ్నిపర్వతం.. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న ప్రజలు

దీని ఎత్తు 5,592 మీటర్లు ఉంది. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది. ఈ అగ్నిపర్వతం చివరి సారిగా 1993లో పేలింది. 2006, 2015లో కూడా స్వల్పంగా లావాను వెదజల్లింది.