Israeli couple
Final Pic : ఇజ్రాయెల్‌లోని గాజా స్ట్రిప్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న రెయిమ్‌లో మ్యూజిక్ ఫెస్ట్ జరిగింది. ఇందులో పాల్గొనేందుకు వెళ్లిన అనేకమంది హమాస్ మిలిటెంట్ల దాడిలో చనిపోయారు. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి వెళ్లిన ఓ ప్రేమ జంట చివరి ఫోటో అంటూ ఇంటర్నెట్‌లో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలోని జంట బ్రతికే ఉన్నారా? అసలు ఏమైంది?
Israel Hamas War : భీకరదాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్.. హమాస్ టన్నెల్, బంకర్ నెట్ వర్క్ లే టార్గెట్
దక్షిణ ఇజ్రాయెల్‌లోని గాజా స్ట్రిప్ సరిహద్దుకు సమీపంలోని సూపర్ నోవా ప్రాంతంలో మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. అదే సమయంలో జరిగిన హమాస్ మిలిటెంట్ల దాడిలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేకమందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకెళ్లారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హమాస్ ఉగ్రవాదుల క్రూరమైన హింస మధ్య తప్పించుకోవడానికి ఓ ప్రేమ జంట తమ చివరి ఫోటో తీసుకోవాలని అనుకున్నారట. నేలపై పడుకుని, ముద్దు పెట్టుకుంటూ సెల్పీ తీసుకున్నారట. తాము బ్రతకకపోతే తమ ప్రేమ చిరస్ధాయిగా నిలిచిపోవాలనే ఆశతో ఫోటో తీసుకున్నారట. అయితే హమాస్ ఉగ్రవాదుల దాడి నుంచి అదృష్టం కొద్దీ ఈ ప్రేమ జంట ప్రాణాలతో బయటపడ్డారు. దాంతో వారి కథ సుఖాంతం అయ్యింది. ఆ సమయంలో తీసుకున్న ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Israeli woman : ఇజ్రాయెల్ వీర వనిత 25 మంది ఉగ్రవాదులను హతమార్చింది…
jewishlivesmatter అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ‘ఇజ్రాయెల్‌లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్‌లో అమిత్, నిర్ అనే ప్రేమ జంట తీసుకున్న ఫోటో ఇది. హమాస్ ఉగ్రవాదల కంట పడకుండా పొదల్లో దాక్కున్నప్పుడు వారు తీసుకున్న ఫోటో వారి ప్రేమను చూపిస్తోంది. ఆ సమయంలో వందలాదిమంది చనిపోయారు. వీరి కథ సుఖాంతం అయ్యింది. ఎందుకంటే వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. వారి ఫోటోని ఎప్పటికీ గుర్తుగా మిగిలిపోయింది’ అనే శీర్షికతో షేర్ చేసారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.