World Contraception Day 2023 : ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం ఎందుకు నిర్వహిస్తారంటే?

ఎలాంటి ప్రణాళిక లేకుండా వచ్చే గర్భధారణను నివారించడానికి గర్భనిరోధకాలు ఉపయోగపడతాయి. వీటిపై అవగాహన కల్పించేందుకు ఏటా సెప్టెంబర్ 26 న 'ప్రపంచ గర్భనిరోధక దినోత్సవాన్ని' నిర్వహిస్తారు.

World Contraception Day 2023 : ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం ఎందుకు నిర్వహిస్తారంటే?

World Contraception Day 2023

World Contraception Day 2023 : గర్భ నిరోధక మాత్రలపై అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వాటిపై అవగాహన కల్పించడానికి ఏటా సెప్టెంబర్ 26న ‘ప్రపంచ గర్భనిరోధక దినోత్సవాన్ని’ నిర్వహిస్తారు.

Health: సంతానలేమికి ఐవీఎఫ్‌.. సరైన ఫలితాలు రావాలంటే?

తల్లిదండ్రులు కావాలనుకునే జంటకు ఓ ప్రణాళిక ఉంటుంది. ఎలాంటి ప్రణాళిక లేకుండా వచ్చే గర్భధారణను నివారించడానికి గర్భనిరోధకాలు ఉపయోగపడతాయి. అయితే మహిళలకు ముఖ్యంగా వీటిపై అవగాహన అవసరం. గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల కుటుంబ నియంత్రణ, HIV AIDS మరియు ఇతర లైంగిక వ్యాధులను నివారిస్తుంది.  అయితే స్త్రీలు, పురుషులకు వేర్వేరు గర్భనిరోధక పద్ధతులు ఉంటాయి.

2007 సెప్టెంబర్ 26న నుండి ‘ప్రపంచ గర్భనిరోధక దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుటుంబ నియంత్రణ ఏజెన్సీలు గర్భనిరోధకాలపై అవగాహన కల్పించడంలో, దంపతులు ఎప్పుడు కుటుంబాన్ని ప్రారంభించవచ్చునో నిర్ణయించుకోవడంలో సాయం చేస్తున్నాయి. గర్భనిరోధకాలు వాడటం వల్ల తల్లీబిడ్డల మరణాలను 40% తగ్గించవచ్చు. ప్రణాళిక లేని మాతృత్వాన్ని నిరోధించడంలో గర్భనిరోధకాలు సాయపడతాయి.  అనారోగ్యం, అనాలోచిత గర్భాలు, వైకల్యం, అబార్షన్ అవకాశాలను గర్భనిరోధక మాత్రలు తగ్గిస్తాయి.

Male Contraceptive Pill : ఇక మగాళ్లకూ ఓ మాత్ర..! అతి త్వరలో అందుబాటులోకి సంతాన నిరోధక పిల్స్, ఎలా పని చేస్తాయి? ఎప్పుడు వేసుకోవాలి?

పిల్, IUD, ఇంజెక్షన్, యోని పద్ధుతుల, కండోమ్, మేల్, ఫీమేల్ సెర్టిలైజేషన్ వంటివి కొన్ని గర్భనిరోధక పద్ధతులు. కొన్ని ఇంట్రాయూటరైన్ పరికరాలు గర్భాశయంలోకి చొప్పించడం ద్వారా అవి స్పెర్మ్ గుడ్డును చేరకుండా నిరోధిస్తాయి. వివాహం కాని మహిళలు, మైనర్ బాలికలు, ఒంటరి, విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువుల విషయంలో ఈ గర్భనిరోధకాలు వాడతారు.