Male Contraceptive Pill : ఇక మగాళ్లకూ ఓ మాత్ర..! అతి త్వరలో అందుబాటులోకి సంతాన నిరోధక పిల్స్, ఎలా పని చేస్తాయి? ఎప్పుడు వేసుకోవాలి?

ఇది వైద్య పరిశోధనలో మరో ముందడగు అని కచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆడవాళ్లకు మాత్రమే గర్భ నిరోధక మాత్రలు అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలోనే మగాళ్లకు కూడా సంతాన నిరోధక మాత్రలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే ప్రీ క్లినికల్ ట్రయల్స్ కూడా సక్సెస్ అయ్యాయి. అంతా అనుకున్నట్లు జరిగితే మరికొన్ని నెలల్లోనే మార్కెట్ లో మగాళ్లకు కూడా ఓ మాత్ర దొరుకుతుంది.

Male Contraceptive Pill : ఇక మగాళ్లకూ ఓ మాత్ర..! అతి త్వరలో అందుబాటులోకి సంతాన నిరోధక పిల్స్, ఎలా పని చేస్తాయి? ఎప్పుడు వేసుకోవాలి?

Updated On : February 16, 2023 / 11:20 PM IST

Male Contraceptive Pill : ఇది వైద్య పరిశోధనలో మరో ముందడగు అని కచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటివరకు ఆడవాళ్లకు మాత్రమే గర్భ నిరోధక మాత్రలు అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలోనే మగాళ్లకు కూడా సంతాన నిరోధక మాత్రలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే ప్రీ క్లినికల్ ట్రయల్స్ కూడా సక్సెస్ అయ్యాయి. అంతా అనుకున్నట్లు జరిగితే మరికొన్ని నెలల్లోనే మార్కెట్ లో మగాళ్లకు కూడా ఓ మాత్ర దొరుకుతుంది.

అవాంఛిత ప్రెగ్నెన్సీని అడ్డుకోవడం కోసం ఆడవాళ్లు గర్భ నిరోధక మాత్రలు వాడుతుంటారు. ఇవి వారు గర్భం దాల్చకుండా అండాల తయారీని అడ్డుకుంటాయి. మరి, మగవాళ్లు. ఇదే ప్రశ్న కొన్నేళ్లుగా తలెత్తుతోంది. గర్భాన్ని నిరోధించేందుకు ఆడవాళ్లకు మాత్రలు ఎందుకు అందుబాటులో ఉన్నాయి. మగవాళ్ల కోసం ట్యాబ్లెట్స్ ఎప్పుడొస్తాయి? అనే చర్చ జోరుగా సాగుతోంది.

Also Read..Free Condoms : కండోమ్స్ ఉచితం.. దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం, కారణం ఇదే..

దీనికి సంబంధించి కొన్నేళ్లుగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడిదే విషయంలో ఓ అడుగు ముందుకు పడిందని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఈ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మగవాళ్ల సంతాన నిరోధక మాత్రకు సంబంధించి ప్రీ-క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి.

వీల్ కార్నెల్ మెడిసిన్(Weill Cornell Medicine) పరిశోధకులు డెవలప్ చేసిన గర్భ నిరోధక మందు తాత్కాలికంగా స్పెర్మ్ ని దాన్ని ట్రాక్ లో నిలిపి వేస్తుందని, సంతానాన్ని నిలువరించే క్రమంలో వాళ్లు చేసిన ప్రీ క్లినికల్ టెస్ట్ లో ఈ విషయం తేలింది. దాంతో ఆన్ డిమాండ్ పురుషుల సంతాన నిరోధక మాత్ర సాధ్యమేనని నిరూపించింది. అవాంఛిత గర్భాలను నిరోధించడంలో ఇదే గేమ్ చేంజర్ కావొచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

సెక్స్‌కు గంట ముందు వేసుకోవాలి..
”గర్భనిరోధం కోసం మహిళలు వాడే పిల్స్ వంటివే పురుషులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. సాల్యుబుల్ అడెనీలిల్ సైక్లాస్(sAC) అనే ఎంజైమ్ ను ఈ డ్రగ్ తాత్కాలికంగా కట్టడి చేయడం ద్వారా వీర్యం అండాన్ని చేరుకోదు. ఇవి మహిళల బర్త్ కంట్రోల్ పిల్స్ కన్నా ప్రభావితమైనవి. సెక్స్ కు గంట ముందు మగవారు వీటిని వేసుకుంటే 24 గంటల పాటు ప్రభావం చూపిస్తుంది” అని శాస్త్రవేత్తలు తెలిపారు.

Also Read..Condom Holes : వార్నీ.. కండోమ్‌కి కన్నం పెట్టింది.. కటకటాల పాలైంది.. ఆ దేశంలోనే తొలి కేసు

పిల్లలను కనడం వాయిదా, సురక్షిత శృంగారం కోసం దాదాపు 2వేల ఏళ్లుగా పురుషుల్లో సంతాన నిరోధకానికి కండోమ్ లు, వేసెక్టమీ లు మాత్రమే ఆప్షన్లుగా ఉన్నాయి. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఆడవాళ్లకు గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, సంతానాన్ని నిరోధించే మాత్రలు పురుషులకు దశాబ్దాలు గడుస్తున్నా అందుబాటులోకి రావడం లేదు. మగవాళ్లలో గర్భ నిరోధాలకు సంబంధించిన పరిశోధనలన్నీ నోటి మాటల దగ్గరే ఆగిపోయాయి. ఎందుకంటే పురుషుల్లో సంతాన నిరోధకాలు వారి శరీరంపై దుష్పలితాలు చూపిస్తాయనే వాదన ఉండేది. పైగా, మహిళలు గర్భం దాల్చడం వల్లే కలిగే నష్టాలను పురుషులు ఎదుర్కోలేరు కాబట్టి దాని గురించి ఇన్నేళ్లు పెద్ద చర్చ జరగలేదని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ దిశగా చురుగ్గా ప్రయోగాలు జరుగుతున్నాయి.

తాజాగా వైద్య నిపుణులు జరిపిన ప్రీ-క్లినికల్ టెస్ట్ లో జన్యుపరంగా ఇంజినీరింగ్ చేయబడిన ఎలుకపై ఆ మందును ప్రయోగించి చూశారు. దానిపై ఆ మందు ప్రభావం చూపింది. ఎలుక స్పెర్మ్ ముందుకు కదలకపోవడాన్ని గమనించారు. కొత్తగా తయారు చేసిన ఇన్ హిబిటర్ 30 నిమిషాల నుంచి గంటలోపే పని చేస్తుంది. ఆ తర్వాత గర్భాన్ని నిరోధించేందుకు వీలుగా స్పెర్మ్ కౌంట్ తగ్గించడానికి, మహిళ అండంలోని గుడ్లు ఫర్టిలైజ్ కాకుండా చేయడానికి వారాల సమయం పడుతుందని చెబుతున్నారు. తదుపరి దశ ప్రయోగాల కోసం వేరే ప్రీ క్లినికల్ పద్దతుల్లో మరోసారి ప్రయోగం చేసి చూడనున్నారు. ఈ ప్రయోగాలు ఆరోగ్యకరమైన పురుషుల్లో శుక్రకణాల చలనాన్ని నిరోధించేందుకు వీలుగా క్లినికల్ ట్రయల్స్ కి పునాది వేయనున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పురుషుల్లో సంతాన నిరోధానికి సంబంధించిన డ్రగ్ కనుక పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యి క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే వైద్య రంగంలో అదో గొప్ప మలుపుగా చెప్పొచ్చు. అప్పుడు మనకు అందుబాటులో ఉండే ఫార్మసీలోనే మగవాళ్ల మాత్ర అని అడిగి మరీ తెచ్చుకుని వేసుకునే రోజులు వచ్చేస్తాయి. మహిళల్లో అండాల తయారీని గర్భ నిరోధక మాత్రలు ఏ విధంగా అయితే అడ్డుకుంటాయో అలాగే పురుషుల సంతాన నిరోధక మాత్రలు కూడా వీర్యకణాల వేగాన్ని అడ్డుకుని, సంతానం కలగకుండా చూస్తాయి. ఈ మాత్రలతో పురుషుల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తకుండా పక్కాగా తయారు చేయాలని చూస్తున్నారు శాస్త్రవేత్తలు.