US Embassy Warning: ఉక్రెయిన్ విడిచి వెంటనే వెళ్లండి.. తమ దేశ పౌరులను హెచ్చరించిన యూఎస్ ఎంబసీ.. ఎందుకంటే?
ఉక్రెయిన్‌లోని అమెరికన్ పౌరులు ఆ దేశం విడిచి వెళ్లాలని అమెరికా రాయబార కార్యాలయం ఆ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో రష్యా తమ దాడులను మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమైందని, ఎప్పుడైనా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందంటూ యూఎస్ ఎంబసీ హెచ్చరించింది.

US Embassy
US Embassy Warning: ఉక్రెయిన్‌లోని అమెరికన్ పౌరులు ఆ దేశం విడిచి వెళ్లాలని అమెరికా రాయబార కార్యాలయం ఆ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో రష్యా తమ దాడులను మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమైందని, ఎప్పుడైనా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందంటూ యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. సురక్షితమైన అందుబాటులో ఉన్న ప్రైవేట్ భూ రవాణా సౌకర్యాలను ఉపయోగించి ఉక్రెయిన్ నుంచి బయలుదేరాలని తెలిపింది.
Terrorists killed: భారత్‌లోకి అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు పాకిస్తానీల కాల్చివేత
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని మొదలుపెట్టి బుధవారం నాటికి ఆరు నెలలు సమీపిస్తోంది. అయితే ఆగస్టు 24న బుధవారం ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని రష్యా మరిన్ని దాడులకు దిగనున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని, అంతేకాక మరికొద్ది రోజుల్లో ఉక్రెయిన్ పౌర మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సౌకర్యాలకు వ్యతిరేకంగా రష్యా దాడులను ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేస్తోందని విదేశాంగ శాఖకు సమాచారం అందిందని తెలిపింది.
ఉక్రెయిన్‌పై రష్యా అనూహ్య దండయాత్ర బుధవారం నాటికి ఆరు నెలల మార్కును సమీపిస్తున్నందున, ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాస్కో క్షిపణి దాడులతో సహా తీవ్ర దాడులకు పాల్పడవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఇతర అధికారుల నుంచి వచ్చిన హెచ్చరికలతో యూఎస్ ఎంబసీ తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలాఉంటే కీవ్‌లో సోమవారం, గురువారాల మధ్య జరిగే అన్ని పెద్ద సమావేశాలపై నగర మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ నిషేధం జారీ చేసింది. సామూహిక కార్యక్రమాలు, శాంతియుత సమావేశాలు, ర్యాలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడేందుకు సంబంధించిన ఇతర కార్యక్రమాలను నిర్వహించడం నిషేధించినట్లు తెలిపింది.
Russia-Ukraine war: ఉక్రెయిన్‌కు అమెరికా భారీ ప్యాకేజ్.. పెద్ద మొత్తంలో ఆయుధాలు పంపనున్నట్లు ప్రకటన
ఈ విషయంపై కీవ్ మిలటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ జనరల్ మైకోలా జైర్నోవ్ మాట్లాడుతూ.. భద్రతా దళాల నిర్ణయాత్మక కేంద్రాలు, సైనిక సౌకర్యాలపై రష్యన్ ఫెడరేషన్ దళాలు చేసే క్షిపణి, బాంబు దాడుల బెదిరింపులకు సకాలంలో స్పందించడానికి వీలుగా ఈ ఆర్డర్ విధించడం జరిగిందని తెలిపారు. ఇదిలాఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతరంగికుడిగా పేరున్న అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె డార్యా డుగినా హత్య వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆగ్రహంతో ఉంది. అయితే ఉక్రెయిన్ ఆ ఆరోపణలు ఖండించింది.