World talest Man
World Tallest Man: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి సుల్తాన్ కోసెన్. ఇతను టర్కీకి చెందిన వ్యక్తి. జీవించిఉన్న అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. అతడు 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. రెండు రోజుల క్రితం (డిసెంబర్ 10) తన బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. కేక్‌తో కలిగిఉన్నఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచాడు. సుల్తాన్ ఆ ఫొటోపై రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే క్యాప్షన్ రాశాడు.
World Tallest Woman : ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్ రికార్డు..ఆమెను చూడాలంటే తల ఎత్తాల్సిందే..
సుల్తాన్ కోసెన్ 2009 సంవత్సరంలో భూమిపై అత్యంత పొడవైన వ్యక్తిగా రికార్డుకెక్కాడు. 251 సెం.మీ ( 8అడుగుల 2.8 అంగుళాలు) పొడవు ఉన్న కోసెన్ తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, ఇప్పటివరకు ఎత్తైన వ్యక్తి రాబర్ట్ వాడ్లో ( 8అడుగుల 11.1 అంగుళాలు) విగ్రహం పక్కన ఫోజులిస్తూ ఫొటోలు దిగాడు. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. నా కంటే ఎత్తుగా ఎవరూ ఉండరని నేను ఆశిస్తున్నాను అంటూ అతను సరదాగా చెప్పాడు.
సుల్తాన్ కోసెన్ 40వ యేట అడుగుపెట్టినందుకు తన కోరికను కూడా వెలుబుచ్చాడు. ప్రపంచంలోనే అనేక దేశాలను సందర్శించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. సుల్తాన్ కోసెన్ తాను సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని తన అవసరాలకు సర్దుబాటు చేస్తూ తన గ్రామంలో ఇంటి నిర్మాణంకు ఉపయోగిస్తున్నారు. ఇదిలాఉంటే సుల్తాన్ విషయంలో.. అతని పిట్యూటరీ గ్రంధి కణితితో దెబ్బతింది, ఇది హార్మోన్ యొక్క అధిక ఉత్పత్తికి దారితీసింది. ఆసక్తికరంగా, అతని ఎదుగుదల 10 సంవత్సరాల వయస్సు వరకు ప్రారంభం కాలేదు.