Viral Video: ‘జూ’లో జట్టు పట్టుకుని జంతువుల్లా కొట్టుకున్నారు

ఇద్దరి మధ్య చిన్న గొడవ ఎంత దూరం పొయ్యిందో ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఆహ్లాదకరంగా పక్షుల కిలకిలతో, జంతువుల విన్యాసాలతో ఉండే 'జూ' వాతావరణం వేడెక్కిపోయింది.

Viral Video: ‘జూ’లో జట్టు పట్టుకుని జంతువుల్లా కొట్టుకున్నారు

Zoo (1)

Updated On : August 10, 2021 / 10:51 AM IST

Wild Animal ZOO: ఇద్దరి మధ్య చిన్న గొడవ ఎంత దూరం పొయ్యిందో ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఆహ్లాదకరంగా పక్షుల కిలకిలతో, జంతువుల విన్యాసాలతో ఉండే ‘జూ’ వాతావరణం వేడెక్కిపోయింది. పక్కపక్కనే నడుస్తూ వెళ్తున్న పర్యాటకులు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. ఇద్దరి మధ్య మొదలైన గొడవ కారణంగా రెండు కుటుంబాలు కుస్తీ పోటీల్లో కొట్టుకున్నట్లు కొట్టుకున్నారు.

మహిళలైతే సిగపట్లు పట్టేశారు. ఒకరి జట్లు ఒకరు పట్టుకుని నేల మీద ఈడ్చుకుంటూ కాళ్లతో తన్నుకున్నారు. ఈ ఘటనతో ‘జూ’కు వచ్చిన పర్యాటకులు ఇబ్బందిగా ఫీలయ్యారు. కొందరైతే నవ్వుకున్నారు. జంతువులు కూడా వారి ఘర్షణను చూస్తూ ఉండిపోగా.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. చైనా రాజధాని బీజింగ్‌లోని​ వైల్డ్​లైఫ్​ పార్క్​లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రజలు పెద్దఎత్తున జూలోని జంతువులను చూసేందుకు రాగా.. వీరి గొడవ కూడా వారికి బాగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. రెండు గ్రూపులుగా విడిపోయి మహిళలు నేల మీద పడిపోయి జుట్లు పట్టుకుని ఘర్షణ పడగా.. ఓ వ్యక్తి వచ్చి చంటి పిల్లాడు చేతిలో ఉన్న మహిళను కాలితో గట్టిగా తన్నిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. చివరికి జూలోని భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు.

అయితే, మనుషుల ప్రభావం జంతువులపై పడినట్లుగా జూ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. మనుషులను అనుకరిస్తూ.. జంతువులు రాత్రి ఒకదానిపై మరొకటి గొడవకి దిగినట్టు వెల్లడించారు. పర్యాటకుల గొడవపై నెటిజన్లు సైతం అసహనం వ్యక్తం చేశారు.