Brother Reaction To Baby Sister Walk : చిట్టిచెల్లెలు బుడిబుడి నడకలు చూసి అన్నయ్య ఆనందం

తన చిట్టిచెల్లెలు వేస్తున్న తొలి అడుగులు చూసి ఎంతగానో మురిసిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఏదోఅద్భుతాన్ని చూసినట్లుగా తన చెల్లెలు బుడి బుడి అడుగుల్ని చూసి తెగ మురిసిపోతున్నాడు ఆ అన్నయ్య. దీనికి సంబంధించిన వీడయో తెగ వైరల్ అవుతోంది.

Brother Reaction To Baby Sister Walk : చిట్టిచెల్లెలు బుడిబుడి నడకలు చూసి  అన్నయ్య ఆనందం

brother cutest reaction to baby sister walk

Updated On : August 30, 2022 / 4:04 PM IST

brother cutest reaction to baby sister walk : కన్నబిడ్డ బుడి బుడి అడుగులు వేస్తుంటే ఎక్కడ పడిపోతుందోనని అమ్మ కంగారుపడిపోతుంది. తూలిపోతున్న అడుగుల్ని నిలుపుకుంటూ బిడ్డ ‘తొలి అడుగులు’వేస్తుంటే చూసి సంబరపడిపోతుంది. బిడ్డ బుడి బుడి నడకలు చూసి ప్రతీ అమ్మ ఆనందిస్తుంది. కానీ ఓ అన్నయ్య మాత్రం తన చిట్టిచెల్లెలు వేస్తున్న తొలి అడుగులు చూసి ఎంతగానో మురిసిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఏదోఅద్భుతాన్ని చూసినట్లుగా తన చెల్లెలు బుడి బుడి అడుగుల్ని చూసి తెగ మురిసిపోతున్నాడు ఆ అన్నయ్య. దీనికి సంబంధించిన వీడయో తెగ వైరల్ అవుతోంది. ఆ చిన్నారి చిట్టితల్లి నడకలు ఎంత అందంగా ఉన్నాయో ఆనడకలు చూసిన ఆ అన్నయ్య స్పందన..సంతోషించే తీరు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. తన చెల్లెలి మొదటి అడుగులు వేయడాన్ని చూస్తాడు. దానికి అతడు స్పందించిన తీరు నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది.

ఒక అన్నయ్య, అతని చిన్న చెల్లెలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతను మొదటిసారి ఆమె నడకను చూసి నిజంగా ఆశ్చర్యపోయాడు. అతను ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. వీడియో నిజంగా ఓ సంతోషకర, ఆశ్చర్యకరమైన అద్భుత క్షణాన్ని క్యాప్చర్‌ చేసింది. ఈ వీడియోని వేలాదిమంది చూసి వావ్ అంటున్నారు. ఆ అన్న చెల్లెలి అనుబంధానికి చక్కటి ప్రతీకలా ఉందీ వీడియో..

వైరల్ అవుతున్న వీడియోలో చిన్న అమ్మాయి లేచి నడవడం ప్రారంభించింది. ఆమె నిలబడలేకపోయినప్పటికీ మెల్లిగా లేచి ఆమె తన మొదటి అడుగును వేసింది. ఇది ఆ అన్నయ్యని సంతోషంతో ఆశ్చర్యపోయేలా చేసింది. తన చెల్లెలు మొదటిసారి నడవడం చూసి అతను ఎలా భావించాడో పసివాడి మాటాల్లో చాలా చక్కగా చెబుతూ వివరించాడు.