లండన్‌లో కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా వేలమంది నిరసన

సెంట్రల్ లండన్‌లోని ఇండియన్ ఎంబస్సీ వద్ద ఆదివారం వేల మంది నిరసన వ్యక్తం చేశారు. ఇండియాలో ఏర్పాటైన కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా, భారత ప్రజలు భారీగా చేస్తున్న నిరసనలకు మద్ధతుగా వారు కూడా సపోర్ట్ ను తెలియజేశారు. బ్రిటిష్ క్యాపిటల్ సెంటర్ ప్రాంతంలోని ఆల్డ్‌విచ్‌లో పలువురు ఆందోళనకారులు గుమిగూడారు. ట్రాఫాల్గర్ స్కేర్ ఏరియా వరకూ ర్యాలీ నిర్వహించారు.
ఇండియాలో పదివేల మందికి పైగా మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. పండించిన పంట అమ్మకానికి, వ్యవసాయానికి సంబంధించి చేసిన చట్టాలు సబబుగా లేవంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ లో పాస్ అయిన చట్టానికి భయపడుతూ.. పంజాబ్, హర్యానా సరిహద్దుల వేదికగా నిరసన చేపట్టారు.
ఇండియా ప్రభుత్వం గోధుమలు, బియ్యం గ్యారంటీ ధరలకు కొనడాన్ని వదిలేస్తుందని, ప్రైవేట్ వ్యాపారుల జాలికే వదిలేసిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. లండన్‌లో ఇండియన్ మూలాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఇండియాలో కనిపిస్తున్న భయాందోళనలు లండన్ లో ప్రతిబింబిస్తున్నాయి.
ఆ ఆందోళనల్లో కాస్త సోషల్ డిస్టెన్సింగ్ కూడా పాటించారు లండన్ వాసులు, ఫేస్ మాస్కులు ధరించి, కొందరు వ్యక్తులు నినాదాలు చేశారు. కొవిడ్ 19నిబంధనలు ఉల్లంఘించారని ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లకపోతే కఠిన చర్యలు తప్పవని మెట్రోపొలిటన్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.