త్రినేత్రం : మూడు కళ్లున్న పాము 

  • Publish Date - May 2, 2019 / 11:07 AM IST

లయ కారకుడైన శివుడికి మూడు కళ్లు (పురాణాల ప్రకారం). శివుడు నాగాభరణుడు. నాగులను ఆభరణాలుగా ధరించినవాడు. ఆయన మెడలో పాము..శిగలో పాము. మరి శివుడికేనా మూడు కళ్లుండేది.ఆయన ఆభరణమైన పాముకి కూడా మూడు కళ్లున్నాయండోయ్..అదేనండీ..మూడు కళ్లున్న పాముని గుర్తించారు అటవీశాఖ అధికారులు.

సాధారణంగా మనుషులకైనా..జంతువులకైనా..కీటకాలకైనా రెండే కళ్లుంటాయి. కానీ ఓ పాముకు రెండు కళ్లున్నాయి. ఆస్ట్రేలియాలో మూడు కండ్లు ఉన్న పామును గుర్తించారు. ఉత్త‌ర ఆస్ట్రేలియాలో వ‌న్య‌ప్రాణి అధికారులు ఓ రోడ్డుపై దీన్ని గుర్తించారు. మూడు కండ్లు ఉన్న పాము ఫోటోల‌ను పోలీసులు త‌మ ఫేస్‌బుక్ పోస్టు చేశారు. ఈ పామును కార్పెట్ పైతాన్‌గా గుర్తించారు. మార్చి నెల‌లో ఇది అట‌వీ అధికారుల‌కు చిక్కింది. 

కాగా దాన్ని గుర్తించిన కొన్ని రోజుల్లోనే ఇది చ‌నిపోయిందని అధికారులు తెలిపారు. డార్విన్ స‌మీపంలోని అర్న్‌హెమ్ హైవేపై ఈ పామును మొద‌టి సారి చూశారట. తరువాత అది కనిపించలేదు. పాము  త‌ల‌పై ఉన్న మూడ‌వ క‌న్నుతో కూడా ఆ పాము చూడగలుగుతోందని వైల్డ్‌లైఫ్ అధికారులు గుర్తించారు. స‌హ‌జ‌సిద్ద‌మైన జ‌న్యుమ్యుటేష‌న్ వ‌ల్ల పాముకు మూడు కండ్లు వ‌చ్చి ఉంటాయ‌ని వారు భావిస్తున్నారు.