Attacked Hindu Temples : బంగ్లాదేశ్ లో 12 హిందూ దేవాలయాలపై దాడి, 14 విగ్రహాలు ధ్వంసం

బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై తరచూ దాడులకు జరుగుతున్నాయి. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా మరో 12 దేవాలయాలపై దాడులకు పాల్పడి దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.

Attacked Hindu Temples : బంగ్లాదేశ్ లో 12 హిందూ దేవాలయాలపై దాడి, 14 విగ్రహాలు ధ్వంసం

attacked temples

Updated On : February 6, 2023 / 2:07 PM IST

Attacked Hindu Temples : బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై తరచూ దాడులకు జరుగుతున్నాయి. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా మరో 12 దేవాలయాలపై దాడులకు పాల్పడి దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. ఠాకూర్ గావ్ జిల్లాలోని ధంతాలా, పారియా, చారుల్ యూనియన్లలో ఉన్న పురాతన కాళీమాత ఆలయంతోపాటు మరో 11 దేవాలయాలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

అంతేకాకుండా ఆలయాల్లో ఉన్న 14 విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగిందని బాలియదంగీ పోలీస్ అధికారి ఖరుల్ ఆనమ్ పేర్కొన్నారు. దాడికి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ ఆలయాలన్నీ రోడ్డు పక్కనే ఉన్నాయని మరో అధికారి బిపుల్ కుమార్ పేర్కొన్నారు.

Hateful Comments On Temple : కెనడాలో హిందూ దేవాలయంలపై విద్వేష వ్యాఖ్యలు

క్షేత్రాలను పూర్తిగా ధ్వంసం చేశారని వెల్లడించారు. హిందూ కమ్యూనిటీ ఎలాంటి ఆందోళన, భయాలకు గురికావొద్దని, అదనపు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని ధంతాలా యూనియన్ పూజా ఉజ్జపోన్ కమిటీ కార్యదర్శి జ్యోతిర్మయ్ సింగ్ డిమాండ్ చేశారు.

గత 50 ఏళ్లుగా ఆలయాల్లో పూజాధికార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.