Hateful Comments On Temple : కెనడాలో హిందూ దేవాలయంలపై విద్వేష వ్యాఖ్యలు
కెనడాలో హిందూ దేవాలయంలపై విద్వేష దాడి జరిగింది. బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ ముందిరంపై గుర్తు తెలియని దుండగులు విద్వేష వ్యాఖ్యలు రాశారు.

Hateful Comments On Temple : కెనడాలో మరోసారి హిందూ దేవాలయంలపై విద్వేష దాడి జరిగింది. బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ ముందిరంపై గుర్తు తెలియని దుండగులు విద్వేష వ్యాఖ్యలు రాశారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాయడంపై టోరంటోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనను ఖండించింది. ఇలాంటి విద్వేష, విధ్వంసకర చర్యల వల్ల కెనడాలోని భారతీయుల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయని వెల్లడించింది.
అలాగే వారికి తీవ్ర హాని, ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని కెనడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది. కెనడాలో గత జులై నుంచి ఇలాంటి మూడు ఘటనలు చోటు చేసుకోవడం తెలిసిన విషయమే. గత ఏడాది జులై నుంచి ఇప్పటివరకు కెనడాలో మూడు సార్లు హిందూ మందిరాలపై దాడులు జరిగాయి.
Idol vandalised: బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయంపై దాడి.. దేవత విగ్రహాన్ని ముక్కలుగా చేసి..
గత ఏడాది సెప్టెంబరులో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. కెనడాలో భారతీయులపై నేరపూరిత చర్యలు, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, సరైన విచారణ జరపాలని చెప్పింది. కెనడాలో కొంత కాలంగా మతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న ఘటనలు విపరీతంగా పెరిగాయి.