ఎగబడి కొన్నారు : టిప్పుసుల్తాన్ తుపాకీ, బాకులు వేలం

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 09:29 AM IST
ఎగబడి కొన్నారు : టిప్పుసుల్తాన్ తుపాకీ, బాకులు వేలం

Updated On : March 28, 2019 / 9:29 AM IST

లండన్ :  మైసూరు టైగర్ టిప్పు సుల్తాన్ తుపాకీ, బాకులు భారీ ధర పలికాయి. బ్రిటన్‌లో నిర్వహించిన వేలంలో టిప్పు సుల్తాన్ తుపాకీ, బాకులకు పోటీపడి కొన్నారు. రూ.54.76 లక్షలకు అమ్ముడయ్యాయి. ఇద్దరు వ్యక్తుల కలిసి వీటిని దక్కించుకున్నారు. ఈస్టిండియా కంపెనీకి చెందిన ఓ అధికారి కుటుంబం కొనుగోలు చేసినట్లు వెల్లడించింది సంస్థ.

మైసూర్ ను పరిపాలించిన టిప్పు సుల్తాన్ కర్ణాటక బెంగళూరుకు 45 మైళ్ళ దూరంలో ఉన్న కోలారు జిల్లా దేవనహళ్ళిలో 1750 నవంబరు 20న జన్మించారు. తండ్రి హైదర్ అలీ మైసూరును పరిపాలించారు. అతని తల్లి ఫాతిమా కడప కోట గవర్నరు నవాబ్ మొయినుద్దీన్ కుమార్తె. ఫ్రెంచ్ వారి కోరికపై మైసూరులో మొదటి చర్చి నిర్మించాడు టిప్పు. అంతేకాదు.. బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి.. పోరాడిన ఏకైక భారతీయరాజు టిప్పు సుల్తాన్. 

1782లో జరిగిన రెండో మైసూరు యుద్ధంలో తండ్రికి కుడి భుజంగా ఉన్నాడు. బ్రిటీష్ వాళ్లను తరిమితరిమి కొట్టాడు. అదే సంవత్సరం తండ్రి హైదర్ అలీ మరణించాడు. చివరికి రెండో మైసూరు యుద్ధం మంగళూరు ఒప్పందంతో ముగిసింది. 1799 వరకు టిప్పుసుల్తాన్ మైసూరు సంస్థానాన్ని పాలించాడు. మూడు, నాలుగో మైసూరు యుద్ధంలో బ్రిటీషు వారి చేతిలో ఓడిపోయాడు. చివరికి మే 4, 1799న శ్రీరంగపట్నాన్ని రక్షించే క్రమంలో బ్రిటిష్ చేతిలో మరణించాడు టిప్పు సుల్తాన్. అతని కత్తికి ఎన్నో వందల మంది శత్రుసైన్యం బలయ్యింది. అలాంటి కత్తి, బాకులను బ్రిటన్ లోని ఓ వేలం సంస్థ అమ్మకానికి పెట్టింది. ఈ వేలంలో 54 లక్షలకు కత్తి, బాకులు అమ్ముడుపోయాయి.