మా అమ్మ నా వేళ్లు కొరుక్కుని తినేసింది!!

మా అమ్మ నా వేళ్లు కొరుక్కుని తినేసింది!!

Updated On : December 14, 2020 / 9:46 PM IST

పిల్లలతో ఆడుకుంటుంటే సరదాగానే ఉంటుంది కానీ, ఒక్కోసారి వాళ్ల చేష్టలకు ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాదు. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ కెమెరాలో చూసుకుంటూ.. ఉన్నారు. వాళ్లమ్మ కూతురి చేతి వేళ్లు పట్టుకుని నోట్లో పెట్టుకుని సౌండ్ చేస్తూ బయటకు తీసింది.

అంతే నములుతున్నట్లుగా వినిపిస్తున్న శబ్ధానికి ఆ పాప ఏడవడం మొదలుపెట్టేసింది. చేతి వేళ్లు చూసుకుంటూ ఏదో జరిగిపోయింది బాబోయ్ అన్నట్లు ఏడ్చింది. ఆ వీడియోను పోస్టు చేసిన జోసెఫైన్ తల్లి ఇప్పటికీ నా కూతురు నేను వేళ్లు తినేశాననే ఫీల్ అవుతుందని చెప్పింది.

డిసెంబర్ 13న పోస్టు చేసిన ఈ క్లిప్పింగ్ కు భారీగా స్పందన వస్తుంది. ప్రతి ఇంట్లో జరిగేదే కావడంతో చూసినవారంతా కనెక్ట్ అవుతున్నారు. ముందుగా కన్ఫ్యూజ్ లో ఉన్నప్పుడు ఆ పాప ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కు అంతా ఫిదా అయిపోతున్నారు. చాలా మంది హార్ట్ ఎమోజీ పోస్టు చేసి తమ ఫీలింగ్ ను పంచుకుంటున్నారు.

ముందు తాను షాక్ అయింది. ఆ తర్వాత ఏడ్చింది. ఆ.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. పాప హావభావాలు చాలా క్యూట్ గా ఉణ్నాయి. ఆమె చాలా స్వీట్. తల్లి భలే చేసిందంటూ మరొకరు కామెంట్ చేశారు. ఈ జనరేషన్ ఇలాగే ఉందంటూ మరొకరు కామెంట్ చేశారు.