Mexico : మెక్సికో బాజా తీరం దాటిన తుపాన్

ఉష్ణమండల తుపాన్ హిల్లరీ మెక్సికో బాజా తీరం దాటింది. ఈ తుపాన్ మెక్సికో బాజా మీదుగా కాలిఫోర్నియా తీరం వెంబడి పయనిస్తుందని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది. ఈ తుపాన్ ప్రభావం వల్ల భారీవర్షాలతో పాటు వరదలు వెల్లువెత్తవచ్చని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది....

Mexico : మెక్సికో బాజా తీరం దాటిన తుపాన్

Tropical Storm

Updated On : August 21, 2023 / 7:13 AM IST

Mexico : ఉష్ణమండల తుపాన్ హిల్లరీ మెక్సికో బాజా తీరం దాటింది. ఈ తుపాన్ మెక్సికో బాజా మీదుగా కాలిఫోర్నియా తీరం వెంబడి పయనిస్తుందని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది. ఈ తుపాన్ ప్రభావం వల్ల భారీవర్షాలతో పాటు వరదలు వెల్లువెత్తవచ్చని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. (Tropical Storm Hilary makes landfall) 84 ఏళ్లలో దక్షిణ కాలిఫోర్నియాను తాకిన తొలి ఉష్ణమండల తుపానుగా హిల్లరీ చరిత్ర సృష్టించింది.

Pulwama Encounter : పుల్వామాలో ఉగ్రవాదులతో మళ్లీ ఎన్‌కౌంటర్

ఈ ఆకస్మిక వరదలు, టోర్నడోలు, అధిక గాలులు, విద్యుత్తు అంతరాయాలు వాటిల్లుతున్నాయి. మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా ద్వీపకల్పానికి ఉత్తరాన గంటకు 100 కిలోమీటర్ల గరిష్ఠ గాలి వేగంతో హిల్లరీ ల్యాండ్‌ఫాల్ చేసినట్లు యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. (Mexicos Baja coast) తుపాన్ ప్రభావం వల్ల బాజా ద్వీపకల్పంలో వరదలకు కారణమైంది.

Samantha : అప్పుడే అమెరికాలో వర్కౌట్లు మొదలుపెట్టేసిన సమంత.. న్యూయార్క్ గాలిలో ఏదో ఉంది..

టిజువానాలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉష్ణమండల తుపాన్ హిల్లరీ ప్రభావం వల్ల దక్షిణ లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలో భారీ వర్షాలు కురిసింది. మెక్సికన్‌లోని శాంటా రోసాలియా పట్టణంలో ఒక వాహనం వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఓ వ్యక్తి నీటిలో మునిగి చనిపోయాడు. వాహనంలో ఉన్న మరో నలుగురిని సహాయక సిబ్బంది కాపాడారు. తుపాన్ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైట్ హౌస్ కోరింది.