నమస్తే అంటున్న ట్రంప్: ప్రపంచం అంతా భారతీయ సంప్రదాయం

ఇంగ్లీష్ సంస్కృతి అయిన షేక్ హ్యాండ్ వద్దు అని అంటుంది ప్రపంచం.. భారతీయ సంస్కృతి అయిన నమస్కారమే ముద్దు అంటున్నారు. సామాన్య ప్రజలే కాదు.. దేశాలకు అధినేతలు సైతం ఇదే పద్దతిని పాటిస్తున్నారు. లేటెస్ట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఐరిష్ ప్రధాన మంత్రి లియో వరద్కర్.. వైట్ హౌస్‌లో సాంప్రదాయ భారతీయ పద్ధతిలో ‘నమస్తే’ అంటూ ఒకరినొకరు పలకరించుకున్నారు.
ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. “మేము ఈ రోజు కరచాలనం చేయలేదు. మేము ఒకరినొకరు చూసుకుని, మేము ఏమి చేయబోతున్నామో చెప్పాము. ఇది మాకు చాలా కొత్తగా ఉంది. అయితే బాగుంది” అని ట్రంప్ వైట్ హౌస్‌లో విలేకరులతో వరద్కర్‌తో కలిసి మాట్టాడుతూ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుండగా.. ఇటువంటి సంస్కృతి ప్రజలకు మేలు చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
కరోనా దెబ్బకు పక్కనున్నవారు దగ్గినా, తుమ్మినా, జలుబుతో బాధపడినా దగ్గర ఉండేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలోనే ఎదుటివారికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్తే అని వాడుతున్నారు. ట్రంప్ ఏ కాదు.. ఇటీవల ప్రిన్స్ ఛార్లెస్ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వబోయి, వెంటనే చేయిని వెనక్కి తీసుకొని నమస్కారం చేశారు. ఈ సన్నివేశం వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
See Also | భారత్ లో తొలి కరోనా మృతుడు…హైదరాబాద్‌లో ఆరు రోజులు గడిపాడు