Turkey Terror Attack : టర్కీలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి.. 14మందికి తీవ్ర గాయాలు!

Turkey Terror Attack : ఏరోస్పేస్ కంపెనీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణ లేకుండా దాడులు జరిపారు. ఈ ఉగ్రదాడుల్లో ముగ్గురు మృతిచెందగా, 14మంది గాయపడినట్టు సమాచారం.

Turkey Terror Attack : టర్కీలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి.. 14మందికి తీవ్ర గాయాలు!

Turkey Terror Attack Many Dead And Injured Near Ankara ( Image Source : Google )

Updated On : October 23, 2024 / 8:52 PM IST

Turkey Terror Attack : టర్కీలో ఉగ్రదాడి జరిగింది. దేశ రాజధాని అంకారా సమీపంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏరోస్పేస్ కంపెనీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణ లేకుండా దాడులు జరిపారు. ఈ ఉగ్రదాడుల్లో ముగ్గురు మృతిచెందినట్టు సమాచారం.

పదుల సంఖ్యలో గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. స్థానిక మీడియా ప్రకారం.. అంకారాకు ఉత్తరాన 40 కిలోమీటర్లు (25 మైళ్ళు) దూరంలో ఉన్న చిన్న పట్టణంలోని కహ్రామంకజన్‌లో భారీ పొగతో పెద్ద మంటలు వ్యాపించాయి. గాయపడినవారిని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

భారీ కాల్పులతో పాటు భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి.  పేలుడు, కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ వెల్లడించారు. అంకారాలోని ఏరోస్పేస్ కంపెనీని లక్ష్యంగా చేసుకుని ఈ ఉగ్రదాడి జరిగినట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు హోం మంత్రి ట్విట్టర్ ద్వారా సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించారు.

అయితే, ఈ ఏరోస్పేస్ కంపెనీలోకి ఇద్దరు ఉగ్రవాదులు చొరబడినట్టు అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఉగ్రవాదుల్లో ఒకరు ఆత్మాహుతి దాడికి పాల్పడగా.. మరొకరు కాంప్లెక్స్ సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపినట్టు వెల్లడించాయి. ఇస్తాంబుల్‌లో డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు ప్రధాన వాణిజ్య ప్రదర్శనగా నిలిచిన ఈ ఏరోస్పేస్ కాంప్లెక్స్‌‌లో గతవారమే ఉక్రెయిన్ అగ్ర దౌత్యవేత్త సందర్శించారు. ఈ ఉగ్రదాడికి పాల్పడింది ఎవరు అనేది ఏ గ్రూపు బాధ్యత వహించలేదు.

పేలుడుకు సంబంధించిన పరిస్థితులు అస్పష్టంగానే ఉన్నాయి. అయితే, కొన్ని మీడియా సంస్థలు ఆత్మాహుతి దాడికి అవకాశం ఉన్నట్లు సూచిస్తున్నాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. టీయూఎస్ఏఎస్ (TUSAS) టర్కీ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇతర ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో దేశం మొట్టమొదటి స్వదేశీ యుద్ధ విమానం (KAAN) అభివృద్ధి చేసింది.

Read Also : మోదీ, జిన్‌పింగ్‌ భేటీ వేళ.. 2019 నుంచి భారత్‌, చైనా మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నాయో చూద్దామా?